Wednesday, July 27, 2016

కలల గురువులు

వెన్నెల వీటను మల్లె దొంతరల; 
దొర్లించినదీ చిన్నెల పాట!! 
క్రొన్నెలవంకకు తొక్కు పలుకులను ; 
నేర్పించినదీ వేదన తేట; 
కన్నుల భరిణల అశ్రు తంత్రులను ; 
కదిలించెను ఎద బాధలు మీట ||వెన్నెల||
;
గడసరితనము అల్లిన జిలిబిలి గీతులలోన ; 
రాధాపదముల జాడలు నిలిచినవి 
;పాటల పదములు, మదను నిఘంటున ; 
వరుసల వారిగ, పేర్మి పేరుకొనె! ||వెన్నెల|| 
;
సైకత తీరము చెప్పెడు కథలకు ; 
కితకిత పెట్టును మలయమారుతము ; 
మూలను ఉన్న మురికి శిల్పమునకు ; 
తళతళ పెట్టును ఊహలు! ||వెన్నెల||
;
 కలికి నవ్వులలో వెన్నెల 
నెలకొన ; అమావాస్య నిశి వెలుగుల తేలెను ; 
చిలిపి కలలకు గురువులు అయినవి ; 
కలలాడెడు చెలియ నగవులు! ||వెన్నెల||
;
============================== ,
;
kalala guruwulu [ pATa 45 pEjI 51]  ;-

wennela weeTanu malle domtarala; 
dorlimchinadee chinnela paaTa!!     ||wennela||
;
kronnelawamkaku tokku palukulanu ; 
nErpimchinadI wEdana tETa; 
kannula bhariNala aSru tamtrulanu ; 
kadilimchenu eda baadhalu meeTa   ||wennela||
;
gaDasaritanamu allina jilibili geetulalOna ; 
raadhaapadamula jADalu nilichinawi 
;pATala padamulu, madanu nighamTuna ; 
warusala waariga, pErmi pErukone!   ||wennela|| 
;
saikata teeramu cheppeDu kathalaku ; 
kitakita peTTunu malayamaarutamu ; 
muulanu unna muriki Silpamunaku ; 
taLataLa peTTunu Uhalu!   ||wennela||
;
 kaliki nawwulalO wennela 
nelakona amaawaasya niSi welugula tElinu ; 
chilipi kalalaku guruwulu ayinawi ; 
kalalADeDu cheliya nagawulu!   ||wennela||
;
;           కలల గురువులు [ పాట పేజీ 51]  

No comments:

Post a Comment