Wednesday, July 27, 2016

మర్రి ఆకు పానుపు

మర్రి చిగురుటాకునందు 
శయనించిన బాలుడు ;
శేషశాయి అలల పైన 
తేలి తేలి వస్తున్నాడదిగదిగో!  ||
;
కాలి బోటనవ్రేలు నించక్కా ; 
గట్టిగాను పంట పట్టి
నోట చొంగలూరుచుండ ;
చీకుచున్నాడు చూడు డదె 
గమ్మత్తు మాయలో!           || 
;
ఊరకూర్క చప్పరిస్తు 
ఊరకుంటేను వాడు ;
క్రిష్ణుడెట్లాగ ఔతాడు చెప్పండీ!
అరికాలి వ్రేలు 
తాకిందీ లలాటమును!
వ్రేలిగోరుతోటి నొక్కి ; 
చిత్రంగా,
చిత్రమైన తిలకము 
ధరియించినాడు ;
ఇంపుగాను క్రిష్ణుడు,
మన చిన్ని క్రిష్ణుడు  ||
;
==============================,
;
marri chiguruTAkunamdu 
Sayanimchina baaDu ; 
SEshaSAyi alala tEli wastunnaaDadi
gadigO! kaali bOTanawrElu nimchakkaa 
gaTTigaanu pamTa  paTTi ; nOTa
chomgaluuruchumDa ;
cheekuchunnaaDu chUDu Dade 
gammattu maayalO!
Urakuurka chapparistu 
UrakumTEnu wADu ; 
krishNuDeTlAga autADu cheppamDI!
arikaali wrElu taakimdii lalATamunu! 
wrEligOrutOTi nokki ; 
chitramgaa,
chitramaina tilakamu dhariyimchinADu ; 
impugaanu krishNuDu, 
mana chinni
krishNuDu  ||

; [ ksm  song ]

] పూలజడ, మధురై మల్లెలు ; 
] బాలకృష్ణుని దాగుడుమూతలు ;-  
   ఆ కడ, ఈ కడ ఏ కడనున్నా [జల్లెడ  LINK ]
;

No comments:

Post a Comment