అరమరసేయకు అలసట బెట్టకు ;
నయనము విప్పి కరుణను చూడరా!
కరివరదా! కరమందీయవా!?
ఈ యెడ సేవాభాగ్యము లీయవ!? ||
;
కస్తూరి మృగము కాళ్ళు పట్టి ;
ప్రాధేయపడి పడీ, పొందాను
ఇంత చిటికెడు కస్తూరి ;
శ్రీవర తిలకము తీర్చు
భాగ్యముల నీయరా! సన్నుతాంగా! ||
;
చిన్ని గంధపు చెక్క దెస్తిని ;
వన్నె అగరు గంధ మిదియే!
మోదమలరగ ; సమ్మోద మెగయగా
మైపూతలను అలదనీరా,
; చిన్ని కృష్ణా! ||
;
========================,
;
aramara sEyaku alasata bettaku
nayanamu wippi karuNanu chUDarA!
kariwaradA! karamamdIyawA!? ||
;
kastUri mRgamu kaaLLu paTTi ;
praadhEyapaDi paDI,
pomdaanu imta chiTikeDu kastUri ;
SrIwara tilakamunu tIichETi
bhaagyammu liiyarA! sannutaamgA! ||
;
chinni gamdhapu chekka destini ;
wanne agaru gamdha midiyE!
mOdamalaraga ; sammOda megayagaa
maipuutalanu aladaniiraa, chinni kRshNA! ||
No comments:
Post a Comment