Saturday, July 2, 2016

వర సీమలు

వర సీమలు ఈ సీమలు ; 
శ్రీరాముల అడుగుజాడలను
హత్తుకున్న 'వందుకుని'* ;
అందుకనే -
||ఈ సీమలు వర సీమలు ||
;
త్వరపడక శాంతమ్ము ; 
నీతి మార్గమందున ; 
ప్రచులితముగ చరియిస్తూ ; 
వరలు తీరులను; "తీరుగ" - 
నేర్పినవి లోకులకు!
విశ్వ మానవాళికి జనులందరికిని 
ఈ లావణ్య లలిత పదముద్రల పద్మములు ||
జీవనాదర్శములకు, 
జీవిత చలనమ్ములకు ; 
వరలుగాను ఏర్పడుతూ ;
తృప్తిగాను ప్రజలకు ; 
అందినవీ మానవులకు 
మా వర రమ్య మధుర జలములు 
మా నవ రమ్య మధుర జలములు||
;
*****************************************,
1] అందుకనే = threfore , for that reason ;
2] హత్తుకున్న 'వందుకుని'* = 
; హత్తుకున్నవీ+అందుకుని' = take ; ; 
*****************************************,
[ fb ;- SRIRAAMAARAAMAM] [ రామసుధ ]

No comments:

Post a Comment