Saturday, July 2, 2016

ఉయ్యాలలు

ముక్కోటి దేవతలు ముచ్చటల దేలుచూ; 
కోటిసూర్యప్రభలు  వెలుగొంద ;  
               నా స్వామి! ఊగ రావయ్యా! 
                      ఉయ్యాల లూగరావయ్యా!  || 

చిన్ని ప్రహ్లాదుని చెన్నుగా కాచేవు! 
వన్నెచిన్నెలు వాడె పన్నగము ఏలయ్య!? 
ఈ పసిడి శ్రీ డోల ఉండెను నీ కోసమే! 
              వేగ రావయ్య! ఊగ రావయ్యా!  || 
;
గజరాజు మొర వినుచు, పరుగులను తీసేవు ; 
ధావనము మేను క్లేశములు పొందెనో! 
ఈ బేల తల్లి వుంది నీ కోసమే! ;  
              వేగ రావయ్య! ఊగ రావయ్యా!  || 
;
=====================================,
;









#; 

mukkOTi dEwatalu muchchaTala dEluchuu; 
kOTisuuryaprabhalu  welugomda ; 
naa swaami! Uga raawayyA! uyyaala lUgaraawayyA!  ||
;
chinni prahlaaduni chennugA kaachEwu! 
wannechinnelu wADe pannagamu Elayya!? 
I pasiDi SrI DOla umDenu nii kOsamE! 
wEga rAwayya! Uga raawayyaa!  || 
;
gajaraaju mora winuchu, parugulanu teesEwu ; 
dhaawanamu mEnu klESamulu pomdenO! 
ii bEla talli wumdi nI kOsamE! ;  
wEga rAwayya! Uga raawayyaa!  || 
;
 [ పాట   - బుక్ పేజీ  44 ]  
అఖిలవనిత; 36237 - 873 posts, last published on Jun 29, 2016  

No comments:

Post a Comment