పరమపద సోపాన క్రీడలందున -
నిచ్చెనలు ఎక్కుటలొ నీకు నీవే సాటి;
బేలలము నీదు భక్తులము ఎల్లరము! ;
ఇక పైన
మాకన్ని నేర్పుట - నీ వంతు!
నీదు చిత్తము, మాదు భాగ్యాలు కన్నయ్యా! ||
;
చెరుకు గడలివిగోర! రావయ్య క్రిష్ణయ్య! ;
చప్పరిస్తూ బాగ జుర్రుకోవయ్యా!
మన్మధుని తండ్రివి,
నీకు చప్పగా అనిపిస్తె -
ఏమి సేతుము?
మేమేమి సేతుము! క్రిష్ణమ్మ!
నీదు చిత్తము, మాదు భాగ్యాలు కన్నయ్యా! ||
;
వెన్నపూస, జున్ను,పాలివిగోర! క్రిష్ణా!
వీని గ్రోలక ఇతరులిళ్ళలొ
ఉట్టి పయిని దుత్తలందలి
మీగడలకై దూలమ్ములెక్కెద
వేమి సేతుము?
మేమేమి సేతుము! క్రిష్ణమ్మ!
నీదు చిత్తము, మాదు భాగ్యాలు కన్నయ్యా! ||
;*********************************************,
రాధామనోహరం (శీర్షిక: శ్రీ కృష్ణ భావలహరి) ;
No comments:
Post a Comment