శ్రీకృష్ణుడు పురాణపురుషుడు, ప్రజల అభిమానాన్ని సంపాదించి,
దైవస్థానాన్ని పొందిన అద్భుత వ్యక్తి. !!!!!
శ్రీకృష్ణుని ప్రాచీనతనునిరూపించే ఆధారాలు అనేకం దొరికాయి.
ఆ ఆధారాలను కనుగొని, వెల్లడించినది విదేశీయులే అవడము
చెప్పుకోదగిన విశేషమే!
*******************************:
ఆఫ్ఘనిస్తాన్, సోవియెట్ రష్యాసరిహద్దులలో "ఐ-ఖనం" అనే
ప్రదేశములో అన్వేషణ జరిపారు.
ఆ సర్వేను చేసిన పరిశోధకుడు "పి.బెర్నార్డ్ "
ఫ్రెంచ్ ఆర్కియలాజికల్ అన్వేషకులు
(P. Bernard and a French archeological Expedition)
"భరతవర్షములో శ్రీకృష్ణ ఆరాధన ఎంత ప్రాచీనమైనది? "
అనే అంశము వారిని ఆకర్షించినది.
సర్ విల్లియం జోన్స్ (sir william Jones) అధ్యనములు మున్నగునవి
భగవంతునిగా సుప్రతిష్ఠుడు ఐనట్టి
"శ్రీకృష్ణుడు- అత్యంత ప్రాచీనకాలము నాటి వాడు"- అని
3-4 శతాబ్దములనాటి క్రీస్తుపూర్వ నాణెముల ముద్రలు - ఋజువు చేస్తూన్నవి.
ఆఇ-ఖనుం వద్ద ఆరు కంచు నాణెములు త్రవ్వకములలో లభించినవి.
ఆ రెక్టాంగులర్ కాయిన్లు 180-165 బి.సి. నాటివి అని బోధపడినది.
(Indo-Greek ruler Agadhochles (180?-165 BC).
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (బ్రొంజె) కాయిన్స్ లభ్యమైనవి.
అవి అగాథాక్ల్స్ - అనే ఇండో గ్రీకు పాలకుడు జారీ చేసిన
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (bronze) కాయిన్స్
(six rectangular bronj coins (180-165 BC) గొప్ప చారిత్రక సంపద.
ఆ ఆరు నాణెములపైన గ్రీకు, బ్రాహ్మీ అక్షరములు కలవు.
ఆ రెండు భాషల లిపితోపాటుగా విష్ణుమూర్తి/ వాసుదేవ బొమ్మ ఉన్నది.
ఆ ప్రతిమ హస్తములలో చక్రము, శంఖము ఆకారపు వస్తువు ఉన్నవి.
వైష్ణవ మతములో ఆరాధించే "శ్రీ విష్ణుమూర్తి" శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించును.
వీనిలోని రెండు చిహ్నములు- ఐన శంఖ, చక్రముల ధారణ- వలననే
'ఈ బొమ్మ విష్ణువుది!'- అనే అభిప్రాయానికి ప్రత్యక్షనిదర్శనము.
అక్కడ దొరికిన మరో - "అగాధో క్లిస్- కాయిన్" పైన
"హలమును ఎత్తి పట్టినట్టి బలరామదేవుని చిత్రము,
అలాగే పరమేశుడు, దుర్గాదేవి, కుషాణ ప్రభువైన రెండవ కనిష్క చక్రవర్తి బొమ్మ,
3-4 శతాబ్దములనాటి కాయిన్- బ్రహ్మదేవుని వదనము కలది -
చారిత్రక శోధనకు అమూల్యముగా దొరికినవి.
*******************************:
దర్గా పీర్ రత్తన్ నాథ్- కాబూలులో ఒక విగ్రహము ఉన్నది.
ఆ పాలరాతి బొమ్మ పీఠముపై ఇలాగ రాసి ఉన్నది.
"మహా వినాయకుని ఘన సుందర మూర్తి"- అని
పీఠముపైన చెక్కబడి ఉన్న ఆ మార్బుల్ ప్రతిమను
"షాహి రాజా ఖింగలుడు" ప్రతిష్ఠితమొనర్చెను.
ఆఫ్ఘనిస్తాన్ లో 5వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మ గర్దెజ్ అనే చోట లభించినది.
*******************************:
{పురాణపురుషుడు శ్రీకృష్ణుడు}
Fort Wall design |
ఆధారములు :-
శ్రీ కృష్ణ image of Vishnu, or Vasudeva, carrying a Chakra,
a pear-shaped vase/ conchshell,
Indo-Greek ruler Agathocles (180?-?165B.C.).
(six rectangular bronze coins issued by the Indo-Greek ruler
పురాణపురుషుడు శ్రీకృష్ణుడు
అఖిలవనిత
Pageview chart 30181 pageviews - 776 posts, last published on Feb 18, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56502 pageviews - 1011 posts, last published on Feb 16, 2015 - 6 followers
No comments:
Post a Comment