Wednesday, July 13, 2011

గుహుని చిన్ని పడవ














నా బుల్లి పడవదే భాగ్యము;
శ్రీ రాములోర్ని తన ఒడిని
నీలమణిగ చేకొన్నది

రాజహంస హొయలులు;
ఇంతలోనె పొందినదీ నా పడవ;
ఇంతలోనె అంత గీర చూపించును,
                         హమ్మభడవ!  ||

తమ్ముడు లక్ష్మన్న తోడ;
పూబోణి సీతమ్మతోటి
ఎక్కినాడు రామన్న
ఎక్కినాడు నా పడవ ||

ఆవలి తీరం అపుడే చేరామా రామయ్యా!
నా పడవ బోసిపోయింది,
నా ఎడద గుల్ల వోయింది;
గంగమ్మ డిల్లవోయేను;

మరల నీవు; మరలి వచ్చునందాకా;
ఈ రేవునందు
మా చూపుల- పూ రేకులు హత్తుకునీ ఉంటాయి
ఇలాగేహత్తుకునీ ఉంటాయి
ఇలాగే ఇలాగే ఈలాగుననే!

No comments:

Post a Comment