Saturday, July 2, 2011

పృధ్వి భరణి















పరిమళ దరహాసినీ! శ్రీ హరి ప్రియ అర్ధాంగీ!
మా లోగిలి నీకు నెలవు! కొలువుందువు సతతము!
                                   కరుణామయి! రావమ్మా!   ||              

విమల భావ సుధా వర్ష-ములను వెదజల్లుమా!
రామ చక్కని భామ! శ్రీరామ చంద్ర ప్రియ పత్నీ! ||మా లోగిలి||

ధరణి నీ విలాసముగ- కరుణను కురిపించుమమ్మ!
క్షీర సాగరాలయా! శేష శయను భామినీ!          ||మా లోగిలి||

భరణి పృధ్వి నిండుగా నీ లాసము;నింపుమమ్మ!
నెర నమ్మిన నీ భక్తుల- కల్ప వల్లి నీవమ్మా!       ||మా లోగిలి||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


parimaLa darahaasinI! nIraajaalayaa!/ya!
SrI hari ardhaaMgii/gi!; raakEMdu vadana!
suhaasinI!ni!
maa lOgili nIku nelavu!
koluvuMduvu satatamu! karuNAmayI! ||
vimala BAva sudhaa varsha-mmulu veda/kuripiMchumA!
raama chakkani BAmini! SrI raama chaMdra praya patnI! ||
dharaNi nI vilaasamu/mmu;
BaraNi pRdhvi nI laasamu;
kshIra saagaraalayaa! paala kaDali putrikA!
mElu anugrahammulu nI varamulu!!!!! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

                   లావణ్య దరహాసినీ! స్మిత వీచి సంధాయినీ! ;  (Link for poetic songs, kusuma)




No comments:

Post a Comment