Wednesday, July 20, 2011
మోజు తీరదు ఇదేమి?
పాలు, వెన్నల, జున్నుమోజు తీరగబోదు –
యుగములైనా గాని ఇది ఏమి క్రిష్ణా! ||
పగడాల పెదవుల – పాలనురుగుల్లు;
మోజు తీరగబోదు – యుగములైనా గాని ||
క్షీర సాగర మధన – తరుణమున నీవే!
శ్రీ కూర్మ – అవతార మూర్తిగా
అందరిని బ్రోచితివి ||
తెలి పాల కడలిలో తనివితీరా స్వామి!
తాబేలు వలె బాగ స్నానాలు చేసేవు, ఈదులాడేవు
అయిననూ క్రిష్ణయ్య!
పాలు వెన్నల మోజు తీరదు ఇదేమి? ||
&&&&&&&&&&&&&&&&&&
paalu vennala junnu
mOju tIradu idEmi?
yugamulainaa gaani
idi Emi krishNaa! ||
pagaDAla pedavula – paalanurugullu;
mOju tiiragabOdu – yugamulainaa gaani ||
kshIra saagara madhana – taruNamuna nIvE!
SrI kUrma – avataara mUrtigaa
aMdarini brOchitivi ||
teli pAla kaDalilO
tanivitiiraa swaami!
taabEluval baaga
snaanaalu chEsEvu IdulADEvu
ayinanU krishNayya!
paalu vennala mOju tIradu idEmi? ||
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment