Friday, July 8, 2011

శ్రీకరుని గారాబములు
































మారాజు; శ్రీకరుడు శ్రీవేంకటేశుడు
కొంగు బంగారము మారాణి కి ||

కూతవేటు దవ్వు తిరుచానూరు నందున
నాతి అలకల కులుకు కలికి దేవేరి!  
దూత కావాలంటె ఇదె మేఘము
పూత పరిమళమింపు సందేశముల్
అంపేది ఎవరమ్మ?- మన స్వామి వారేను! ||  

సారె పంపించేరు పద్మావతీ సతికి ;
సారె సారెకు అర్చనల వైభవములు ;
కోటి గారాబములు దక్కుతున్నాయి భళి!  
పుట్టినిల్లును కూడా మరపించును
మారాజు; శ్రీకరుడు అర్ధాంగి పద్మకి ||

No comments:

Post a Comment