Saturday, July 23, 2011

పెసర ఆవకాయ













పెసర ఆవకాయ:-
పెసర పిండి-> అర  కప్పు;
కారము-> ఒక కప్పు;
వేరు సెనగ నూనె-> రెండు కప్పులు;
నాలుగు కప్పులు -> మామిడి కాయ ముక్కలు;
అర కప్పు-> ఉప్పు; వెల్లుల్లి రెబ్బలు, కరేపాకు;

[1:2:4 = పెసర [పిండి: నూనె: మ్యాంగో ముక్కలు;
వీటికి అర్ద ఉప్పు ఔతుంది. అంటే ఏడు / 7 కప్పుల
మిశ్రమానికి అర కప్పు ఉప్పు సరిపోతుందన్న మాట!]
తయారీ: ముందుగా పెసర పప్పును ఎండ బెట్టాలి.
ఒక  రోజంతా, బాగా ఎండిన ఆ పెసరపప్పును, పొడి చేసుకుని,
ఊరగాయకోసం రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు ఆవకాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.
వెడల్పాటి గిన్నెలో- మనం సిద్ధం చేసుకుని ఉంచుకున్నట్టి
కప్పు పెసర పిండినీ, కప్పు ఉప్పునూ, అర కప్పు కారాన్నీ కలిపి,
ఈ మిశ్రమంలో రెండు కప్పుల నూనెను వేసి బాగా కలపాలి.
ఇపుడు నాలుగు కప్పుల మామిడి ముక్కల్నీ,  వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపేసేయాలి.
ఈ మొత్తం పదార్ధాలలో ఇంగువ తాళింపుతో కొంచెం నూనెను వేసేయాలి.
అంతే! పెసర ఆవకాయ ఘుమఘుమలాడుతూ రెడీ!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment