వితరణము/మ్ముగ పుణ్య భావాలయమున
అతులిత కాంతులు వెదజల్లు ప్రమిదలుగ
సుస్థిరములాయేను అందరి మనములు*1
అవధి లేని ఆస్థి,స్వామి అనుగ్రహము  ||
చెండు మల్లియలు, పారిజాతము పువులు
మెండుగా అల్లుదము కడు వేడుక
దండి సింగారములు తిరు వేంకటేశునికి 
పండుగలు, సంబరము- లందరి కనులకు   ||
ప్రపంచము అరచేతి పుష్పమ్ముగా-
లభియించెనీనాడు మన భాగ్యము
విపంచిగా లోకమున శాంతి సౌహార్ద్రములు
రవళించు శుభవేళ కాహ్వానము   || 
   
 *1 మనసులు
 
No comments:
Post a Comment