Saturday, July 2, 2011

ఎండా వానా, కప్పల పెళ్ళి






















వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు!
వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ!   ||

విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు;
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ!    ||

జల జల జలతార్(రు) వర్ష ధారలుగ – మేదినిపైకి రావోయీ!
తొలకరి జల్లుగ రావయ్యా-ధరిత్రి మెప్పును పొందవయా!       ||

కుంభ వృష్టివై, లోకులను- భయపెట్టితె, నీతో పచ్చి, కటీఫ్
ఎండా వానా, కప్పల పెళ్ళి - ముత్యాల జల్లు,మురిపెపు ఝల్లు!!!!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


  (Link for song) : ఎండా వానా, కప్పల పెళ్ళి
 Categories - బాల ; Written by kusuma kumari
Monday, 27 June 2011 10:30 
         Link Essay in కోణమానిని బ్లాగు ; బాల సాహిత్యము



No comments:

Post a Comment