కార్తీక నవరాత్రులిట భాసురం;
ధార్తి హర్షములకు నిత్య శ్రీకారము ||
కమలమ్ము నుండి ఉద్భవించిన తల్లి
విమల తేజస్విని- అలమేలు మంగమ్మ ||
శ్రీ/ సిరులొలుకునదె దివ్య పద్మ సరసు*1 మండపము
తిరుచనూరు అంటె నవ్య వైకుంఠమే కద, ఓ అమ్మలార! ||
కార్తీక నవరాత్రులిట భాసురం;
ధార్తి హర్షములకు నిత్య శ్రీకారము ||
*1-> సరసు/సరోవరము
@@@@@@@@@@@@@@@@@@@@@@
No comments:
Post a Comment