Saturday, July 30, 2011

బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ tree


బెర్ముడా పంట్లాములు, 
అదేనండీ లాగులు ఒక ఫ్యాషన్ గా చలామణిలోకి వచ్చినవి.
అది సరే!
బెర్ముడా ట్రయాంగిల్ అనే భౌగోళిక వింత సీమ ఉన్నది.
బెర్ముడా ట్రయాంగిల్ -
ఇప్పటికీ పరిశోధకులకు అంతు పట్టని మిస్టరీ.

అక్కడి ఒక వింత చెట్టును చూడండి.
ఈ చెట్టు కాండము పైన "కన్ను" వలె  బెరడుపైన ఉండటం అబ్బురమే!



















            Trees of the Bermuda Triangle   (Link)


Saturday, July 23, 2011

పెసర ఆవకాయ













పెసర ఆవకాయ:-
పెసర పిండి-> అర  కప్పు;
కారము-> ఒక కప్పు;
వేరు సెనగ నూనె-> రెండు కప్పులు;
నాలుగు కప్పులు -> మామిడి కాయ ముక్కలు;
అర కప్పు-> ఉప్పు; వెల్లుల్లి రెబ్బలు, కరేపాకు;

[1:2:4 = పెసర [పిండి: నూనె: మ్యాంగో ముక్కలు;
వీటికి అర్ద ఉప్పు ఔతుంది. అంటే ఏడు / 7 కప్పుల
మిశ్రమానికి అర కప్పు ఉప్పు సరిపోతుందన్న మాట!]
తయారీ: ముందుగా పెసర పప్పును ఎండ బెట్టాలి.
ఒక  రోజంతా, బాగా ఎండిన ఆ పెసరపప్పును, పొడి చేసుకుని,
ఊరగాయకోసం రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు ఆవకాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.
వెడల్పాటి గిన్నెలో- మనం సిద్ధం చేసుకుని ఉంచుకున్నట్టి
కప్పు పెసర పిండినీ, కప్పు ఉప్పునూ, అర కప్పు కారాన్నీ కలిపి,
ఈ మిశ్రమంలో రెండు కప్పుల నూనెను వేసి బాగా కలపాలి.
ఇపుడు నాలుగు కప్పుల మామిడి ముక్కల్నీ,  వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపేసేయాలి.
ఈ మొత్తం పదార్ధాలలో ఇంగువ తాళింపుతో కొంచెం నూనెను వేసేయాలి.
అంతే! పెసర ఆవకాయ ఘుమఘుమలాడుతూ రెడీ!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Wednesday, July 20, 2011

మోజు తీరదు ఇదేమి?
















పాలు, వెన్నల, జున్నుమోజు తీరగబోదు –
యుగములైనా గాని ఇది ఏమి క్రిష్ణా!   ||

పగడాల పెదవుల – పాలనురుగుల్లు;
మోజు తీరగబోదు – యుగములైనా గాని   ||

క్షీర సాగర మధన – తరుణమున నీవే!
శ్రీ కూర్మ – అవతార మూర్తిగా
                         అందరిని బ్రోచితివి       ||

తెలి పాల కడలిలో తనివితీరా స్వామి!
తాబేలు వలె బాగ స్నానాలు చేసేవు, ఈదులాడేవు

అయిననూ క్రిష్ణయ్య!
పాలు వెన్నల మోజు తీరదు ఇదేమి? ||

&&&&&&&&&&&&&&&&&&
 



paalu vennala junnu
mOju tIradu idEmi?
yugamulainaa gaani
idi Emi krishNaa!   ||

pagaDAla pedavula – paalanurugullu;
mOju tiiragabOdu – yugamulainaa gaani   ||

kshIra saagara madhana – taruNamuna nIvE!
SrI kUrma – avataara mUrtigaa
aMdarini brOchitivi       ||

teli pAla kaDalilO
tanivitiiraa swaami!
taabEluval baaga
snaanaalu chEsEvu IdulADEvu
ayinanU krishNayya!
paalu vennala mOju tIradu idEmi? ||

కను దోయి మహలు
















చెన్న కేశుని రూపు –
మా కనుగవ భవంతిలో
మిన్నగా కొలువయిన –
రాకేందు బింబము ||

 కన్నయ్య!
 నీ కెంపు అధరాల నిండుగా
 తెలి తరిపి పాలు, వెన్నలు -
 జున్ను మీగడల హంగు     ||

   మబ్బు గుబురుల సందు లందుండి
   దూసుకొచ్చేటి తొలి పొద్దు వోలె
   నీ పగడాల పెదవుల కాంతి  మెరిసేను ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

                kanu dOyi mahalu


chenna kESuni rUpu – maa kanugava BavaMtilO
minnagaa koluvayina – raakEMdu biMbamu ||

1) kannayya! nI keMpu adharaala/ la niMDugaa
tali taripi pAlu, vennalu , junnu mIgaDala haMgu

2) mabbu guburula saMdu – laMduMDi
        dUki vachchE toli poddu sUrIni – vOle/ rItigaa
pagaDAla pedavula kAMti  merisEnu ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


       For another song    (Link 1)  ప్రకృతి మన దేవత

       అంకెలతో చిలక జ్యోతిష్యుడు  (Link 2 )
       ఝుమ్ ఝుమ్ ఝుమ్ మధురాల పాట  (Link 3)
          అమ్మ! నాకు వినిపించు                       ఆ కోకిల పాటలు

Wednesday, July 13, 2011

గుహుని చిన్ని పడవ














నా బుల్లి పడవదే భాగ్యము;
శ్రీ రాములోర్ని తన ఒడిని
నీలమణిగ చేకొన్నది

రాజహంస హొయలులు;
ఇంతలోనె పొందినదీ నా పడవ;
ఇంతలోనె అంత గీర చూపించును,
                         హమ్మభడవ!  ||

తమ్ముడు లక్ష్మన్న తోడ;
పూబోణి సీతమ్మతోటి
ఎక్కినాడు రామన్న
ఎక్కినాడు నా పడవ ||

ఆవలి తీరం అపుడే చేరామా రామయ్యా!
నా పడవ బోసిపోయింది,
నా ఎడద గుల్ల వోయింది;
గంగమ్మ డిల్లవోయేను;

మరల నీవు; మరలి వచ్చునందాకా;
ఈ రేవునందు
మా చూపుల- పూ రేకులు హత్తుకునీ ఉంటాయి
ఇలాగేహత్తుకునీ ఉంటాయి
ఇలాగే ఇలాగే ఈలాగుననే!

దుస్తుల హ్యాంగర్సు తో షాండ్లియర్

     
వృధాగా పారేస్తూన్న హ్యాంగర్లు ఉన్నాయా?
ఐతే ఆ Waste mwterial తో రియల్ ప్రపంచంలో- real useful things ను తయారుచేసినది.
కావలసిన సామగ్రి:-
కొంచెం కళాదృష్టి,
కొంచెం ఆలోచన
అదిగో!-ఇచ్చట, ఇలాగ అందమైన షాండ్లియర్ ప్రత్యక్షమైనది.
చూసి see, do[plastic hangersStunning Chandelier
Made from
Recycled Plastic Hangers]

]

వస్త్ర ప్రపంచము కళలు, బొమ్మలు


















వస్త్ర కళలు;
వృధాగా పారేస్తూన్న దుస్తులను, కళాదృష్టి -
ఇలాగ అద్భుతమైన, వినోదభరితమైన విభిన్నమైన బొమ్మలుగా మార్చేసింది.
ఇక్కడ ఆ దుస్తుల కళ/ వస్త్ర ప్రపంచము కళను వీక్షించండి.


వస్త్ర కళలు, Art with garments  (LINK)

పనికిరాని వస్తువులే ఉపయుక్త సరంజామా


వాడి పారేస్తూన్న, పనికిరాని వస్తువులే
ఉపయుక్త సరంజామాగా రూపు దాలుస్తూన్న పనితనమును కనుగొనండి,
ఈ ఫొటోలు చూసి.ట్యూబ్ లైట్ లు, వాటర్ బాటిళ్ళు,
ఇలాగ నిలువు గొట్టంలాగా ఉన్న  కవర్లతో, కార్డ్ బోర్డులతో-
ఇలాగ ఉపయోగకరమైన వస్తువులను కొందరు తయారు చేస్తూన్నారు.
పనికిరాని వస్తువులే
ఉపయుక్త సరంజామా

Monday, July 11, 2011

unity, ఐకమత్యము (vedio)

పశువులలో ఐకమత్యముతో ఆపదలను ఎదుర్కొన్న సీను ఇది.
ఎద్దులు సింహాలను తరిమిన దృశ్యం ఇది.

Tags:  (link )
అరేయ్ IDIOTS మీరు ఎవరు ర? మీది మాది ఏంటి ర? ఇంకా మనది అని ఎప్పుడు అంటారు 


see this VEDIO

ఉమ్మడిగా కలిసుందాము

















ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము;
గోవిందుని జాడలు కనుగొందాము ||

చిత్తడి మడిలో పరుగులు పెట్టే;
           నీల మణీశుని పట్టుదము

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


పొదరిళ్ళ మల్లియల శ్వేత కాంతిలో-
            పీతాంబరుని వెదుకుదము ||

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


యమునలొ మీనుల నేస్తం చేసి-
        వాని, మొప్పల మాటున దూరేనో? ||

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


మయూరి మైత్రితొ- శత పింఛముల
      పురి వెనకాతల ముడుచుకొనేనో?||

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


@@@@@@@@@@@@@@@@

okE jaTTugaa ummaDigaa uMdaamu, kalisuMdaamu; gOviMduni jADalu kanugoMdaamu ||
@)chittaDi maDilO parugulu peTTE; nIla maNISuni paTTudamu
|| okE jaTTugaa ummaDigaa uMdaamu, kalisuMdaamu; gOviMduni jADalu kanugoMdaamu ||
@)podariLLa malliyala SvEta kaaMtilO-pItaaMbaruni vedukudamu ||
@)yamunalo mInula nEstaM chEsi-vaani, moppala mATuna dUrEnO? ||
@)mayUri maitrito- Sata piMCamula puri venakaatala muDuchukonEnO?||

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

రిబ్బన్/ rope knots


బాల బాలికలూ!  పిన్నలూ! పెద్దలూ!
వూలు దారాలతో, రిబ్బనులతో, వైరులతో
కొన్ని ముడులను(knots) వేసేదెలాగో చూడండి!
వీలైతే చూసి, నేర్చుకోండి.

Friday, July 8, 2011

సప్తాద్రి దారి





















ఇవియె సోపానములు - ఏడు కొండల దారి
ఎక్కుదాము రండి! ఏమరక అందరము ||

తిరు వేంకటేశుని -సత్వరానుగ్రహ సౌహార్ద్ర శత కోటి ;
నిలయము తిరుపతి - అనుచు కనుగొంటిమి
అందుకనె ఆ ఊసు అందుకుని బయలుదేరేము  ||

తరు లతాగ్రముల, ఫల పత్ర చలనములు
ఆతురతగా నింగి సంచలన హరివిలులు
సప్తాద్రిగా వెలిసె*1 సప్త వర్ణములు;

*1  వెలిసె/విరిసె

దేవుని దరహాసము, దేవేరికి వైకుంఠము
















సప్తగిరి అణువణువు పులకించగా
గండు కోయిలలై జనులార! నోరార
భక్తి-కీర్తనలను పాడగా రండి -       ||

సానంద మందార మకరందములు నిండ
వాన విల్లులు విరియు*1 ప్రతి హృదయము
ఆ వినీలాకాశమునకు ప్రతిబింబము  
           ఇది తథ్యము  ||

శ్రీ పద్మనాభుని దరహాసము
శ్రీ పద్మావతీదేవి వైకుంఠము
ఆ దర్శనము మన కనుల వైభోగము
          ఇది తథ్యము  ||

*1 విరియు/య

శ్రీకరుని గారాబములు
































మారాజు; శ్రీకరుడు శ్రీవేంకటేశుడు
కొంగు బంగారము మారాణి కి ||

కూతవేటు దవ్వు తిరుచానూరు నందున
నాతి అలకల కులుకు కలికి దేవేరి!  
దూత కావాలంటె ఇదె మేఘము
పూత పరిమళమింపు సందేశముల్
అంపేది ఎవరమ్మ?- మన స్వామి వారేను! ||  

సారె పంపించేరు పద్మావతీ సతికి ;
సారె సారెకు అర్చనల వైభవములు ;
కోటి గారాబములు దక్కుతున్నాయి భళి!  
పుట్టినిల్లును కూడా మరపించును
మారాజు; శ్రీకరుడు అర్ధాంగి పద్మకి ||

Thursday, July 7, 2011

శుభవేళ విపంచీ రవళి

















వితరణము/మ్ముగ పుణ్య భావాలయమున
అతులిత కాంతులు వెదజల్లు ప్రమిదలుగ
సుస్థిరములాయేను అందరి మనములు*1
అవధి లేని ఆస్థి,స్వామి అనుగ్రహము  ||

చెండు మల్లియలు, పారిజాతము పువులు
మెండుగా అల్లుదము కడు వేడుక
దండి సింగారములు తిరు వేంకటేశునికి
పండుగలు, సంబరము- లందరి కనులకు   ||

ప్రపంచము అరచేతి పుష్పమ్ముగా-
లభియించెనీనాడు మన భాగ్యము
విపంచిగా లోకమున శాంతి సౌహార్ద్రములు
రవళించు శుభవేళ కాహ్వానము   ||

    *1 మనసులు

కార్తీక నవరాత్రులు (పద్మావతి)
















కార్తీక నవరాత్రులిట భాసురం;
ధార్తి హర్షములకు నిత్య శ్రీకారము  ||

కమలమ్ము నుండి ఉద్భవించిన తల్లి
విమల తేజస్విని- అలమేలు మంగమ్మ ||

శ్రీ/ సిరులొలుకునదె దివ్య పద్మ సరసు*1 మండపము
తిరుచనూరు అంటె నవ్య వైకుంఠమే కద, ఓ అమ్మలార! ||


కార్తీక నవరాత్రులిట భాసురం;
ధార్తి హర్షములకు నిత్య శ్రీకారము  || 


*1-> సరసు/సరోవరము

@@@@@@@@@@@@@@@@@@@@@@

Saturday, July 2, 2011

పృధ్వి భరణి















పరిమళ దరహాసినీ! శ్రీ హరి ప్రియ అర్ధాంగీ!
మా లోగిలి నీకు నెలవు! కొలువుందువు సతతము!
                                   కరుణామయి! రావమ్మా!   ||              

విమల భావ సుధా వర్ష-ములను వెదజల్లుమా!
రామ చక్కని భామ! శ్రీరామ చంద్ర ప్రియ పత్నీ! ||మా లోగిలి||

ధరణి నీ విలాసముగ- కరుణను కురిపించుమమ్మ!
క్షీర సాగరాలయా! శేష శయను భామినీ!          ||మా లోగిలి||

భరణి పృధ్వి నిండుగా నీ లాసము;నింపుమమ్మ!
నెర నమ్మిన నీ భక్తుల- కల్ప వల్లి నీవమ్మా!       ||మా లోగిలి||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


parimaLa darahaasinI! nIraajaalayaa!/ya!
SrI hari ardhaaMgii/gi!; raakEMdu vadana!
suhaasinI!ni!
maa lOgili nIku nelavu!
koluvuMduvu satatamu! karuNAmayI! ||
vimala BAva sudhaa varsha-mmulu veda/kuripiMchumA!
raama chakkani BAmini! SrI raama chaMdra praya patnI! ||
dharaNi nI vilaasamu/mmu;
BaraNi pRdhvi nI laasamu;
kshIra saagaraalayaa! paala kaDali putrikA!
mElu anugrahammulu nI varamulu!!!!! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

                   లావణ్య దరహాసినీ! స్మిత వీచి సంధాయినీ! ;  (Link for poetic songs, kusuma)




ఎండా వానా, కప్పల పెళ్ళి






















వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు!
వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ!   ||

విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు;
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ!    ||

జల జల జలతార్(రు) వర్ష ధారలుగ – మేదినిపైకి రావోయీ!
తొలకరి జల్లుగ రావయ్యా-ధరిత్రి మెప్పును పొందవయా!       ||

కుంభ వృష్టివై, లోకులను- భయపెట్టితె, నీతో పచ్చి, కటీఫ్
ఎండా వానా, కప్పల పెళ్ళి - ముత్యాల జల్లు,మురిపెపు ఝల్లు!!!!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


  (Link for song) : ఎండా వానా, కప్పల పెళ్ళి
 Categories - బాల ; Written by kusuma kumari
Monday, 27 June 2011 10:30 
         Link Essay in కోణమానిని బ్లాగు ; బాల సాహిత్యము