Monday, February 28, 2011

చెన్న రాయడ!ఉర్వికి జలతారు పందిరులు
























వెన్నెలల నీడలై పర్వాలి క్రిష్ణయ్య!
నీ నవ్వు వెన్నియలు,
ఉర్వికి జలతారు పందిరులు ||

నీ యోచనమ్ములో
మనుగడలు సార్ధకము
చెన్న రాయడ! నీకు
నా ఎడద మందిరము ||

మల్లి కాడల ఊసు
లల్లి బిల్లిగ చెండు
లల్లి ఉంచానయ్య!
నీడలై పర్వాలి
నీ నవ్వు వెన్నియలు ||


&&&&&&&&&&&&&&&

Kovela
By kadambari piduri, Oct 12 2009 9:14PM

నా మది బంగారు కలశము



లోకోత్తరమ్ముగా నీ రూప ధ్యానము
రసవత్తరమ్మైన పున్నమిల పందిరి ||

ఆగడము ఆపయ్య! పాల్కడలి వాస!
నిలకడౌ నా భక్తి శ్రీ రామ చిలుక ||

నవనీతమది-దొరికె నిప్పట్టున
రమ్యమౌ నీ మూర్తి నిలువగానే
నా మది బంగారు కలశమ్మె ఐనదిర! ||

&&&&&&&&&&&&&&&&&&&

తర్జన భర్జనలు











పూసలా? చుబుకమంటిన -
- వెన్న పూసలా?
తర్జన భర్జనలు !

నవ్వులా? - వెన్నెలల మడుగులా?
తర్జన భర్జనలు !

గగనమా? - హరి మేని మోహన వర్ణమా?
తర్జన భర్జనలు !

సిగ ముడిని ముడిచిన పింఛమా?
కన్నయ్య అవనిని వెద జల్లిన
కారుణ్య సుధా కిరణములా?
భక్తియా? అను రక్తియా?
ముక్తిలోన వెల్లి విరిసిన శక్తియా?

"నేను తానా?
తాను నేనా?"

యశోదమ్మకు మనసులోన
తర్జన భర్జనలు!
$$$$$$$$$$$$$$$$$$$$$$$

tarjana bharjanalu !







pUsalaaa? chubukamaMTina -
venna pUsalaa?
tarjana bharjanalu !

navvulaa? - vennelala maDugulaa?
tarjana bharjanalu !

gaganamaa? - hari mEni mOhana varNamaa?
tarjana bharjanalu !

siga muDini muDichina piMCamaa?
kannayya - avanini veda jallina
kaaruNya sudhaa kiraNamulaa?

bhaktiyaa? anu raktiyaa?
muktilOna velli virisina Saktiyaa?
"nEnu taanaa?
taanu nEnaa?"
yaSOdammaku manasulOna
tarjana bharjanalu!

Friday, February 25, 2011

రాణి కోపాలను కాదననేల? ( my paint )


















కొర కొర చూపులు
కోటి తారకలు అయ్యే వేళల
కాదననేల? నీ కినుకలను?
కానుక లవ్వి
మన్మథ స్వామికి .

పూల రథము సాగుతూన్నది



















పూల రథము సాగుతూన్నదయా! ;
తెప్ప, పూల రథము సాగుతూన్నదయా!;
స్వామి దయా సుధా రస సరసున ||

కొలనంతా పడవ పూల
అద్దకములు మురిసెను;
నీలి నింగి వంగి
నీట - నింపాదిగ వాలినది ;
తానిపుడు,
నిత్య పౌర్ణిమనైతిననీ
అవనికి వెలిబుచ్చినది ||

పద్మావతి, స్వామి వారి
మణి కిరీట దీప్తులు;
చుక్క శిశువుల చెంపల ;
హత్తి మురిసె గగన జనని / మాత ||



Tuesday, February 22, 2011

Ernest Egerton Wood తాండవ నాట్య వర్ణన


ఎర్నెస్ట్ ఎగెర్టన్
వుడ్ ,
థియొసాఫికల్ సొసైటీ(Link see) సిద్ధాంతాలకు సన్నిహితుడు.
Ernest Egerton Wood (18 August 1883)
అన్నీబిసంట్ ( Annie Besant ),
జిడ్డు క్రిష్ణ మూర్తి ఇత్యాది సభ్యులతో
మైత్రి కలిగిన
Professor Ernest Egerton Wood
యోగిగానూ, దివ్య జ్ఞాన సమితి కార్యకలాపాలలో పాల్గొన్నాడు.
యోగిగానూ, సంస్కృత
భాషాభిమానిగానూ ప్రశంసలను పొందాడు.
అనేక గ్రంధాలను రచించిన ప్రొఫెసర్ .
ఆ పండితుడు రాసిన తాండవ నృత్య పద్యాలు ఇవి.
అతని రచన "పరమేశుని తాండవ నాట్య వర్ణన"
భక్తి తన్మయత్వాల ప్రతిబింబము.





Shiva Tandava Stotram


by ERNEST WOOD, 1931 ( see the Link)

O prosper us, Auspicious Lord,
Performer of the frantic dance,
O Bearer of the little drum
Sounding damad, damad, damad;
As through the forest of Thy hair,
Descends the purifying stream
About Thy neck, from which depends
Thy garland made of serpent-kings.

O may’st Thou be my constant joy,
Who dost the young moon crest employ;
Whose breadth of brow supports the fire
Blazing dhagad, dhagad, dhagad;
The river of the holy ones,
Revolving in Thy mound of hair,
Like wind-tossed creepers, waves upthrows
And glory on Thy head bestows.

May I find bliss within Thy being
O Thou, enrobed in space alone;
Whose mind is gladdened by the glance,
Side-long and constant, love-entranced,
Of Parvati, sweet daughter of
The Lord of Mountains, Himavat;
Whose eyes compassionful, dispel
Our miseries insuff’rable.

In Thee, O Master of all Life,
My heart ecstatic joy may feed;
O Thou, with upper garment smooth,
The passion-blinded demon’s skin.
The tawny serpents in Thy hair
Upon the face of Nature paint
Light from the jewels of their hoods-
A radiance, like to saffron spread.

O Great One, Bearer of a skull,
May we be prosperous in Thee;
On whose broad brow blazes the fire
That with its flame consumed the god
Of flower love; who art obeyed
By all the leaders of the gods;
Among whose hair the Ganges plays;
Whose crest-jewel gleams with moon-like rays.

May’st Thou, O Moon-Tiaraed One,
To us eternal riches be;
O Thou, the foot stool of whose throne
Is carpeted with pollen strewn
From flowers that deck the jeweled crowns
Of all the gods, from Indra down;
Whose twisted hair in coils is bound
The King of serpents girdled round.

Thou Three-Eyed One, be my delight;
O Thou, who form’st, with highest skill,
Rare figures on the breast of her
Descended from the hard of Hills.
Upon the tablet of Thy brow
Blazes dhagad, dhagad, dhagad,
The fire in which was sacrificed
The fell five-arrowed God of Love.

O Thou, Upholder of the Worlds,
Extend to us Thy blessings rich;
O skin-adorned, Moon beams-graced;
Thou bearer of the holy flood;
Whose neck, enwrapped in darkness thick
As moonless midnight, flashes forth
Amidst the ring of gathered clouds
Its shining light unconq’rable.

I worship Thee, destroyer of
Death, passion and blind ignorance,
The castles three, the elephant,
The sacrifice and birth and death;
Whose graceful plantain-stem-like throat
Sheds radiance all about Thy neck,
Resembling with its splendour dark
The fully-blossomed lotus blue.

I worship Thee, destroyer of
Death, passion, and blind ignorance,
The castles three, the elephant,
The sacrifice, and birth and death.
The arts of her who blesses all
Are like the blossoms of a tree,
From which the honeyed essence flows
To Thee, the bee that in them joys.

O Shiva, Thou art conqueror;
Performer of the frantic dance,
Which joins the beating of the drum,
Sounding dhimin, dhimin, dhimin,
With melody sublime and grand;
While on Thy awful brow the fire
Flares with the fanning of the breath
Of serpents whirling rapidly.

O Shiva, when shall I with true
Adorning equally accept
A hard stone and the softest bed,
A serpent and a string of pearls,
A priceless diamond and a clod
Of earth, a friend and enemy,
Mere grass and women lotus-eyed,
His subjects and a mighty king?

O when shall I be always glad,
Dwelling in holy Ganges’ bower,
From evil thoughts my mind released,
My hands before my forehead joined,
Repeating ever and again
The chant of “Shiva, Shiva” writ
Upon the forehead of her grace
The best of women, Parvati?

Extend to us our hearts’ delight,
O Thou, joy-giving day and night;
O Shining Presence, Lord Supreme
To Parvati, of women queen,
In Indra’s land the maidens fair
Wear jasmine clusters in their hair;
From these the pollen dropping free,
Exudes a salve which graceth Thee.

O may the world be conquered by
Thy marriage – music benison,
With “Shiva, Shiva” as its theme,
When sweet-eyed Parvati is bride;
The sound of which melodious,
By highly-gifted women sung,
Destroys all evils, be they dire
As the sub-ocean blazing fire

ఢమరు ఇరు వైపులుగా రాత్రి, పగలు





























మంచు తెఱలన్నిటా ఆ తళుకు బెళుకులు
ఇంద్ర ధను వన్నియలు పెంచేను విభ్రమాలు :
అవి ఏమి తళుకులే? అమ్మలాల!
అవి ఏమి బెళుకులే?, అమ్మలాల! ; ||

సుందరేశుని కొలువు, అమ్మలాల!
అందమౌ హిమ నగము అమ్మలాల!
అవి ఏమి తళుకులే? అమ్మలాల!
అవి ఏమి బెళుకులే?, అమ్మలాల! ||

ఢమరుకము చేకొనెను - రే పవలు ఇరువైపు
నాదమెగసిన వేళ అమ్మలాల!
ప్రమద గౌరికి మోదమ్ము అమ్మలాల!
గిరి పుత్రి జత గాడు కైలాస చక్రవర్తి ||

నట రాజు, పార్వతి
ఆది దంపతులు
నటనాలు, నాట్యములు
ధరకిడిన సంపదలు ||

&&&&&&&&&&&&&&&&&&































Dhamaru iru vaipulugaa raatri, pagalu ;
______________________________

maMchu te~ralanniTA aa taLuku beLukulu
iMdra dhanu vanniyalu ;
peMchEnu viBramaalu : O ammalaala!
avi Emi taLukulE? avi Emi beLukulE?, ammalaala! ; ||

suMdarESuni koluvu, ammalaala!
aMdamau hima nagamu ammalaala! ||
Dhamarukamu chEkonenu -rE pavalu iruvaipu -
naadamegasina vELa ammalaala!
pramada gauriki mOdammu ammalaala!
giri putri jata gADu -kailaasa chakravarti ||
naTa rAju, paarvati
Adi daMpatulu -naTanAlu,
nATyamulu -dharakiDina saMpadalu ||

నటరాజు ఆడేనొహో!


























నటరాజు నాట్యములు ఆడేనొహో!
(అనుపల్లవి)

ధిమ్ ధిమ్ ధిమితక
ధిమి ధిమీధిమిం అనుచు //

గంధర్వులు పాడగా
కిన్నెరలు వీణలను మీటగా
ప్రమధ గణములు
ఢమరు ధ్వానములు ఎగయగా //ధిమ్ //

నెల వంక తొంగి వీక్షించగా
అల గంగ ఉప్పొంగి పొరలగా
చెలి హైమ మురిసి పులకించగా
ఇల సస్య ధాన్యాభరణముల వెలయగా //ధిమి//

కైలాస గిరియే కదలెను
తమసు దిక్కులలోన చెదరెను
ప్రణవ నాదమ్ములే మ్రోగెను
నాట్య ప్రభాతమై ప్రకృతియె తనరగా //ధిమి//

&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

నటరాజు ఆడేనొహో!

By kadambari piduri ,Feb 23 2009

పాటలందు మేలి బంతి



















పాటలందు మేలి బంతి
కన్న తల్లి లాలి పాట
సంగీత స్వరములకు ఏలిక
గాన రాణి ఈ లాలి పాట

“ఉళుళ్ళా హాయి! హాయి! -
ఆయిరారే! హాయి పాట”
బాణీలు, వరుస కట్టు
మెట్టుల కిది తొలి మెట్టు

శృతి, తాళము, - లయలకు
గమకములకు గమ్యము
మధురమైన గీతికలకు
జోల పాట ‘రా రాణి’

మబ్బు డోలలను జాబిలి
నీటి ఊయెలల నీడలు
పుడమి ఊయెలల సకలము
పాపాయిల సంతసాల సంపుటి
&&&&&&&&&&&&&&&&&&&&&

{{{{{{{{{[ Posted script only }}}}}}}

paaTalaMdu mEli baMti -
kanna talli laali paaTa
saMgIta svaramulaku Elika
gaana raaNi I laali paaTa

uLuLLaa haayi! haayi! -
aayiraarE! haayi paaTa”.
baaNIlu, varusa kaTTu
meTTulakidi toli meTTu

SRti, taaLamu, - layalaku ,
gamakamulaku gamyamu
madhuramaina gItikalaku
jOla paaTa ‘raa raaNi ‘
mabbu DOlalanu jaabili -
nITi Uyelala nIDalu
puDami Uyelala sakalamu -
paapaayila, saMtasaala saMpuTi
saMgItamulaku raa raaNi




















నువ్వులు" ఎక్కడైనా రాయబడతాయా?????


"నువ్వులు" ఎక్కడైనా రాయబడతాయా?????
ఎర్రకోట వీరుడు - అనే తెలుగు సినిమా
1973 లలో విడుదల ఐనది.
దశరధరామిరెడ్డి దర్శకత్వములో
వచ్చిన చలన చిత్రములో
ఈ పద బంధం ఉన్నది లెండి.
ఈ చలన చిత్రానికి
సంగీత దర్శకుడు ఘంటసాల విజయకుమార్.
ఇతడు ఘంటసాల గారి మొదటి కొడుకు.
ఈ Telugu Movie లో నటి నటులు
ఎన్.టి.రామారావు, నంబియార్,
బి. సరొజాదేవి, సావిత్రి మున్నగు వారు.
cinemaలో ఒక పాట,
సావిత్రి నాట్యంతో చిత్రీకరణ జరిగింది.
సినిమా లోని ఈ గీతం కాస్త
మాషాగా ఉంటుంది .
"అ ఆ - లు అన్నీ
నువ్వులు రాయాలి ;
నా రాజా కన్నుల్లో -
ఎల్. ఆర్. ఈశ్వరి చేత
కథానాయికకు సంబంధించిన గీతాన్ని
పాడించడం కాస్త విచిత్రమే!
సరే! ఇక్కడ ఆ పాటను చదవండి. ;

&&&&&&&&&&&&&&&&&&&&&&

అ - ఆ - లు అన్నీ - నువ్వులు రాయాలి , నా రాజా !
నా కన్నుల్లో హృదయం ఉంది ,నువ్వే చూడాలినా రాజా!



1)అందాల సోకులన్నీ నీకేలే , నా రాజా !
గారాల కోరికలన్నీ
నీకేలే, నా రాజా!
నది లాగా గల గల పారు
ఇంపైన బుల్ బుల్ జోరు
విడరానీ బంధం పెనవేయాలీ ||

2)సొగసైన పూవును నేను ,
కోపమా నా సామీ!
సొరగాలు చూపిస్తాను ,
రా రాదా నా సామి! ||

3)వద్దన్నా వదలను నిన్ను
అన్నా విడువను నేను
వీరాధి వీరుడవీవు నా సామి!
ఊరించకు ఇంకా నన్ను ||

(ఇంతా చేసి ఆనక ఎప్పటికో అర్ధమైంది;
నువ్వు - కు బహువచనము - "నువ్వులు" అన్న మాట.
అలాగ శ్రోతలకు లభించిన బహుమానం " నువ్వులు ' పదం. )

*********************************

a- aa- lu annI nuvvulu raayaali naa raajaa !
naa kannullO hRdayaM uMdi ,
nuvvE chUDAlinaa raajaa!

1)aMdaala sOkulannii nIkElE , naa
raajaa !
gaaraala kOrikalannii nIkElE, naa raajaa!
nadi laagaa gala gala paaru iMpaina
bul^ bul^ jOru viDaraanii baMdhaM penavEyaalI ||

2)sogasaina puuvunu nEnu ,
kOpamaa naa saamii! soragaalu chuupistaanu ,
raa raadaa naa saami! ||


3)Vaddannaa vadalanu ninnu
U nannaa viDuv
anu nEnu
Viiraadhi viiruDaviivu naa saami!
UriMchaku iMkaa nannu ||

Saturday, February 19, 2011

Good Friends నీలి మబ్బులు ;






















గగనమందున నీల వర్ణము
కొలుస్తానని బయలుదేరాయి -
మేఘ మాలలు ;
అంబరమునకు
అవి మంచి నేస్తాలు ||

“మడుగు, చెరువులు, కొలను,ఏరులు,
నదీ నదమ్ములు,
సప్త జలధుల - చేతులందలి అద్దములము మేమె!"
అన్నాయి ;
నీరదమ్ములు
నీటి బాష్పపు సింహాసనముల్ ||

తేట పున్నమి వెన్నెలలకు
దోబూచి ఆటలు నేర్పు గురు(వు)లము!
సూర్య రథ సప్తాశ్వములకు ఆప్త మిత్రులము!
వర్ష రాణుల శీర్షములకు మేల్మి గొడుగులము!
ధరణి మాతకు గారాబు కొంగు బంగరులం! ||

Wednesday, February 16, 2011

యమునకు హర్షము

















నీలి యమున! ఏలనే?
ఆ బెంబేలు? ||

అదిగదిగో! ఆ పైన నీలాంబరము;
చుక్కలను నింపుకొనీ,
ఆ నింగి కెంత మిడిసిపాటు?!
ఔరా!ఏమి ఆ మిడిసిపాటు ..... ||

అంబరంపు గీర చూసి
బెంబేలు, బిత్తరలు! ;
వలదు లేవమ్మా
ఓ యమునా వాహినీ! ||















బాల క్రిష్ణయ్య తోటి భామినుల కేరింతలు,
ముద్దు ముద్దు ఆటలతో,నీ ఝరిలో తానాలు,
స్నానాల ;సందడులు ;
అరెరే! ఓ యమునమ్మా!
ఇంతలోనె నీకింతటి ఆనందం, ఆహ్లాదం ;
ఇంతింతని కొలువలేని చెప్ప లేని సమ్మోదం,
వామనుని రమ్మందువ?
త్రివిక్రమావతార మూర్తిగా కొలిచి చెప్ప గలడా
నీ దరహాసపు లతా నికుంజము కొలతలు?! ||

నాడు, నేడు అమూల్య దశ





















చంద మామ కథలు,
అలనాటి కాశీ మజిలీలు,
జానపదాలూ
చిన్న తనపు ఊహల పర్ణశాలల ముంగిట్లో
వేసిన రంగ వల్లికలు.

వెన్నెల కాంచన కలశాలను ఉంచినాయి
అప్పటి కథలు
అలనాటి బాల కథలు
సుతి మెత్తని అలల సవ్వడులను
బాల్యనికి నాట్యాలు నేర్పించినవి.
శైశవము కూడా
మనిషి జీవితములో
విలువైన ప్రథమ దశ సుమా! - అనిపించిన మరుత్తులు అవి.

అందలి పద చమత్కారాలు, వాల్లభ్య శబ్దాలు -
పాటల పందిరిని నిశ్శబ్దంగా అల్లుకుంటూన్నట్టి
సౌగంధ భరిత, వర్ణ మయ సుమ రాశుల లతా సౌందర్యాలు.

ఇప్పుడు,
చెప్పేందుకు ఏమున్నది?
అంతా సుస్పష్టమే!

డిష్యుం డిష్యుం డిష్యుం.
ప్లాస్టిక్ కొమ్మల మీద
భీభత్స దృశ్యాల కులాయం(= గూడుల)లో
రేపటి గుడ్లు,

ఆ అండాల నుండి
వెలికి వస్తూన్న విహంగాల స్వభావాలు ఎలా ఉంటాయో
చూడ గలిగే గుండె నిబ్బరాన్ని
అలవరుచుకో, మిత్రమా!

( నాడు, నేడు , సుకుమారానికి ప్రాధాన్యం )

Tuesday, February 1, 2011

Bapu bomma కు కర చాలనములు
















పాల వెన్నెల వంటి
చిరు నవ్వు వెన్నెలలు
చిలికించు అమ్మాయీ!
ఈ వసుధయందు
పాల వెన్నెలలు లేని
లోటు తీర్చేస్తివి;

రెండు జడల పాపా!
"బాపు" చిన్నారినీ
శీ గాన పెసూనాంబ -
ఎక్కడున్నాదో
వెతికి, ఇటు కేసి తీసుకొని రావమ్మ!
స్నేహ బంధాలను పెంచుకోవమ్మా!

రెండు జడల సీతను
పరిచయం చేసుకో!
తనతోటి షేక్ హ్యాండు,
మనకు కరచాలనాలు













కళ్యాణ గీతివై కల హంస రావమ్మ! ॥











కల హంస రావమ్మ!
కళ్యాణ గీతివై
కల హంస రావమ్మ! ॥

చదువుల రాణినీ
నీ మూపు నిడుకుని ;
కుదుపులు లేకుండ,
మెల్లగా, ఈ దివికి ॥

కొలను పద్మాలను
అక్షరమ్ముల పొట్లాలుగా చేసి
మాకివ్వవమ్మా! ॥