Saturday, February 19, 2011

Good Friends నీలి మబ్బులు ;






















గగనమందున నీల వర్ణము
కొలుస్తానని బయలుదేరాయి -
మేఘ మాలలు ;
అంబరమునకు
అవి మంచి నేస్తాలు ||

“మడుగు, చెరువులు, కొలను,ఏరులు,
నదీ నదమ్ములు,
సప్త జలధుల - చేతులందలి అద్దములము మేమె!"
అన్నాయి ;
నీరదమ్ములు
నీటి బాష్పపు సింహాసనముల్ ||

తేట పున్నమి వెన్నెలలకు
దోబూచి ఆటలు నేర్పు గురు(వు)లము!
సూర్య రథ సప్తాశ్వములకు ఆప్త మిత్రులము!
వర్ష రాణుల శీర్షములకు మేల్మి గొడుగులము!
ధరణి మాతకు గారాబు కొంగు బంగరులం! ||

No comments:

Post a Comment