Monday, February 28, 2011

తర్జన భర్జనలు











పూసలా? చుబుకమంటిన -
- వెన్న పూసలా?
తర్జన భర్జనలు !

నవ్వులా? - వెన్నెలల మడుగులా?
తర్జన భర్జనలు !

గగనమా? - హరి మేని మోహన వర్ణమా?
తర్జన భర్జనలు !

సిగ ముడిని ముడిచిన పింఛమా?
కన్నయ్య అవనిని వెద జల్లిన
కారుణ్య సుధా కిరణములా?
భక్తియా? అను రక్తియా?
ముక్తిలోన వెల్లి విరిసిన శక్తియా?

"నేను తానా?
తాను నేనా?"

యశోదమ్మకు మనసులోన
తర్జన భర్జనలు!
$$$$$$$$$$$$$$$$$$$$$$$

tarjana bharjanalu !







pUsalaaa? chubukamaMTina -
venna pUsalaa?
tarjana bharjanalu !

navvulaa? - vennelala maDugulaa?
tarjana bharjanalu !

gaganamaa? - hari mEni mOhana varNamaa?
tarjana bharjanalu !

siga muDini muDichina piMCamaa?
kannayya - avanini veda jallina
kaaruNya sudhaa kiraNamulaa?

bhaktiyaa? anu raktiyaa?
muktilOna velli virisina Saktiyaa?
"nEnu taanaa?
taanu nEnaa?"
yaSOdammaku manasulOna
tarjana bharjanalu!

No comments:

Post a Comment