Wednesday, February 16, 2011

యమునకు హర్షము

















నీలి యమున! ఏలనే?
ఆ బెంబేలు? ||

అదిగదిగో! ఆ పైన నీలాంబరము;
చుక్కలను నింపుకొనీ,
ఆ నింగి కెంత మిడిసిపాటు?!
ఔరా!ఏమి ఆ మిడిసిపాటు ..... ||

అంబరంపు గీర చూసి
బెంబేలు, బిత్తరలు! ;
వలదు లేవమ్మా
ఓ యమునా వాహినీ! ||















బాల క్రిష్ణయ్య తోటి భామినుల కేరింతలు,
ముద్దు ముద్దు ఆటలతో,నీ ఝరిలో తానాలు,
స్నానాల ;సందడులు ;
అరెరే! ఓ యమునమ్మా!
ఇంతలోనె నీకింతటి ఆనందం, ఆహ్లాదం ;
ఇంతింతని కొలువలేని చెప్ప లేని సమ్మోదం,
వామనుని రమ్మందువ?
త్రివిక్రమావతార మూర్తిగా కొలిచి చెప్ప గలడా
నీ దరహాసపు లతా నికుంజము కొలతలు?! ||

No comments:

Post a Comment