
నటరాజు నాట్యములు ఆడేనొహో!(అనుపల్లవి)ధిమ్ ధిమ్ ధిమితకధిమి ధిమీధిమిం అనుచు //గంధర్వులు పాడగాకిన్నెరలు వీణలను మీటగాప్రమధ గణములుఢమరు ధ్వానములు ఎగయగా //ధిమ్ //నెల వంక తొంగి వీక్షించగాఅల గంగ ఉప్పొంగి పొరలగాచెలి హైమ మురిసి పులకించగాఇల సస్య ధాన్యాభరణముల వెలయగా //ధిమి//కైలాస గిరియే కదలెనుతమసు దిక్కులలోన చెదరెనుప్రణవ నాదమ్ములే మ్రోగెనునాట్య ప్రభాతమై ప్రకృతియె తనరగా //ధిమి//&&&&&&&&&&&&&&&&&&&&&&&Kovelaనటరాజు ఆడేనొహో!By kadambari piduri ,Feb 23 2009
No comments:
Post a Comment