
మంచు తెఱలన్నిటా ఆ తళుకు బెళుకులు ఇంద్ర ధను వన్నియలు పెంచేను విభ్రమాలు :
అవి ఏమి తళుకులే? అమ్మలాల!
అవి ఏమి బెళుకులే?, అమ్మలాల! ; ||
సుందరేశుని కొలువు, అమ్మలాల!
అందమౌ హిమ నగము అమ్మలాల!
అవి ఏమి తళుకులే? అమ్మలాల!
అవి ఏమి బెళుకులే?, అమ్మలాల! ||
ఢమరుకము చేకొనెను - రే పవలు ఇరువైపు
నాదమెగసిన వేళ అమ్మలాల!
ప్రమద గౌరికి మోదమ్ము అమ్మలాల!
గిరి పుత్రి జత గాడు కైలాస చక్రవర్తి ||
నట రాజు, పార్వతి
ఆది దంపతులు
నటనాలు, నాట్యములు
ధరకిడిన సంపదలు ||
&&&&&&&&&&&&&&&&&&

Dhamaru iru vaipulugaa raatri, pagalu ;
______________________________
maMchu te~ralanniTA aa taLuku beLukulu
iMdra dhanu vanniyalu ;
peMchEnu viBramaalu : O ammalaala!
avi Emi taLukulE? avi Emi beLukulE?, ammalaala! ; ||
suMdarESuni koluvu, ammalaala!
aMdamau hima nagamu ammalaala! ||
Dhamarukamu chEkonenu -rE pavalu iruvaipu -
naadamegasina vELa ammalaala!
pramada gauriki mOdammu ammalaala!
giri putri jata gADu -kailaasa chakravarti ||
naTa rAju, paarvati
Adi daMpatulu -naTanAlu,
nATyamulu -dharakiDina saMpadalu ||
No comments:
Post a Comment