"నువ్వులు" ఎక్కడైనా రాయబడతాయా?????
ఎర్రకోట వీరుడు - అనే తెలుగు సినిమా
1973 లలో విడుదల ఐనది.దశరధరామిరెడ్డి దర్శకత్వములోవచ్చిన చలన చిత్రములోఈ పద బంధం ఉన్నది లెండి.ఈ చలన చిత్రానికిసంగీత దర్శకుడు ఘంటసాల విజయకుమార్.ఇతడు ఘంటసాల గారి మొదటి కొడుకు.ఈ Telugu Movie లో నటి నటులుఎన్.టి.రామారావు, నంబియార్,బి. సరొజాదేవి, సావిత్రి మున్నగు వారు.ఈ cinemaలో ఒక పాట,సావిత్రి నాట్యంతో చిత్రీకరణ జరిగింది.సినిమా లోని ఈ గీతం కాస్తతమాషాగా ఉంటుంది .
"అ ఆ - లు అన్నీనువ్వులు రాయాలి ;
నా రాజా కన్నుల్లో -
ఎల్. ఆర్. ఈశ్వరి చేతకథానాయికకు సంబంధించిన గీతాన్నిపాడించడం కాస్త విచిత్రమే!సరే! ఇక్కడ ఆ పాటను చదవండి. ;
&&&&&&&&&&&&&&&&&&&&&&
అ - ఆ - లు అన్నీ - నువ్వులు రాయాలి , నా రాజా !నా కన్నుల్లో హృదయం ఉంది ,నువ్వే చూడాలినా రాజా!
1)అందాల సోకులన్నీ నీకేలే , నా రాజా !గారాల కోరికలన్నీనీకేలే, నా రాజా!నది లాగా గల గల పారుఇంపైన బుల్ బుల్ జోరువిడరానీ బంధం పెనవేయాలీ ||
2)సొగసైన పూవును నేను ,కోపమా నా సామీ!సొరగాలు చూపిస్తాను ,రా రాదా నా సామి! ||
3)వద్దన్నా వదలను నిన్నుఊఅన్నా విడువను నేనువీరాధి వీరుడవీవు నా సామి!ఊరించకు ఇంకా నన్ను ||(ఇంతా చేసి ఆనక ఎప్పటికో అర్ధమైంది;
నువ్వు - కు బహువచనము - "నువ్వులు" అన్న మాట.అలాగ శ్రోతలకు లభించిన బహుమానం " నువ్వులు ' పదం. )
*********************************
a- aa- lu annI nuvvulu raayaali naa raajaa !naa kannullO hRdayaM uMdi ,nuvvE chUDAlinaa raajaa!
1)aMdaala sOkulannii nIkElE , naaraajaa !gaaraala kOrikalannii nIkElE, naa raajaa!nadi laagaa gala gala paaru iMpainabul^ bul^ jOru viDaraanii baMdhaM penavEyaalI ||
2)sogasaina puuvunu nEnu ,kOpamaa naa saamii! soragaalu chuupistaanu ,raa raadaa naa saami! ||
3)Vaddannaa vadalanu ninnuU nannaa viDuvanu nEnuViiraadhi viiruDaviivu naa saami!UriMchaku iMkaa nannu ||
No comments:
Post a Comment