Saturday, October 30, 2010

రావి ఆకు చిత్రాలెన్నో!












రావి ఆకులను తెచ్చీ
నీళ్ళలోన నానబెట్టీ
ఆనక......
బాగుగాను ఎండ బెడితె
సిద్ధం!సిద్ధం!

కుంచెలూ, రంగులూ
సిద్ధం! సిద్ధం!
బాల బాలికల దుస్తులన్ని ఖరాబు
పిల్లల ఒళ్ళు, ఇల్లు ఏకమవగ
ఆకు చిత్రాలెన్నో
సిద్ధం! సిద్ధం!

రావి పత్రాల పైన
ఎన్నెన్నో బొమ్మలు!
బుల్లి క్రిష్ణ! రావయ్యా!
బొమ్మలను నీకిస్తే
మధు మురళి గానమును
లోకాలకు ఒసగుమోయీ!

Monday, October 25, 2010

ఏనుగు” కు అనేక ప్రత్యేకతలు






















ఐదు మూరల ముక్కు ఉన్నది
రెండు బారల పళ్ళు కలిగినది
ఎవరో చెప్పవె, చిటి పాపా!

1.ముక్కుయె తొండము
పళ్ళు దంతాలు
గణపతి దేవుని ముఖ విలాసము
జంతువులందున ఘనమగు హస్తి=ఏనుగు లేమ్మా!

2. మైసూర్ దసరా సంబరమ్ములు
తమిళ నాడులో, కేరళ సీమల
మావటీలతో చేసే దోస్తీ
ఏనుగు పైన అంబారీ
అంబారీలో సవ్వారీ
అంబరమందే హ్యాపీలు

3. చదరంగమున హస్తి దళములు
ఆటలు మెదడుకు పెట్టును పదునును
నాణెము గైకొని, మాకీయవయా ఆశీస్సులను
అందుకె నీకు వందనమ్ములు శత కోటి నీకయా,
అందుకొనవయా! గజరాజా!

(By kadambari piduri, Sep 18 2009 5:53AM)


హిందువుల ఆరాధ్య దైవమైన వినాయకునికి ప్రతి రూపము "ఏనుగు".
జంతు కారుణ్యము దృష్ట్యా వీని పరిరక్షణ చాలా అవసరము.
శత కోటి ప్రాణి కోటి నివాసముగా ఉన్నప్పుడే ధరిత్రి కళ కళ లాడుతూంటుంది.
వైవిధ్య భరితమైన జీవ కోటితో
ప్రకృతిలోని సమ తౌల్యతను కాపాడవలసిన బాధ్యత పౌరులకు ఉన్నది.
ఐన "గజేంద్రుడు",మన జాతీయ జంతువుగా నిర్ణయించబడటము సానుకూల పరిణామం.
జంతు ప్రపంచములోనే “ ఏనుగు” కు అనేక ప్రత్యేకతలు ఉన్నవి.
పెద్ద సైజు, వింత రూపం గజ రాజువి.
చేటల్లాంటి చెవులు, భారీ రూపం, ఎక్కువగా - నల్ల రంగు, శాకాహారి
సాధారణంగా జంతువులకు కొమ్ములు తల పైన ఉంటాయి,
కానీ “దంతముల రూపం”లో– నోటి వద్ద కలిగి ఉండి,
తొండము కలిగి ఉన్న ఏకైక జంతువు ఏనుగు
ఏనుగుకు బహుళ ఉపయోగ కరంగా ఉంటూన్నాయి.
కుక్క తర్వాత, ఆప్యాయతలకు, యజమాని పట్ల అనుకూలతలకు

Sunday, October 24, 2010

బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో ! ఉయ్యాలో !





















బంగారు గౌరమ్మ ఉయ్యాలో!

బంతి పూలు
కారబ్బంతి పూలు
శంఖం పూలు
ముద్ద బంతి పూలు

వన్నె వన్నెల పూలు
ఎంచీ ఎంచీ తెచ్చి
ఏరేరి తెచ్చాము బతకమ్మా!
సింగారింపులు నీవి!
కనుల పండుగ మాది !

అపరంజి పళ్ళెముల
అంచెలంచెలుగాను
అపురూపముగా తెచ్చి
కూర్చి , కట్టినాము మేము
అందాల పూల మేడ
తల్లి బతుకమ్మకు!

బతుకమ్మ మా యమ్మ !
బంగారు గౌరమ్మ !
మాఇంట కొలువవ్వగ
రాయంచ నడకలతొ
ఎంచక్కా రావమ్మా
బంగారు గౌరమ్మ!

బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో!
బంగారు గౌరమ్మ ఉయ్యాలో!
రాచ వారి పోరి! రతనాల బొమ్మా!
చల్లంగ నూరేళ్ళు వర్ధిల్లవమ్మా!

బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో!
బంగారు గౌరమ్మ ఉయ్యాలో!
ఉయ్యాలో ! ఉయ్యాలో !
=======================/////
uyyaalO ! uyyaalO !

batukamma maa yamma !
baMgaaru gauramma !
maaiMTa koluvavvaga
raayaMcha naDakalato
eMchakkaa raavammaa
baMgaaru gauramma!

baMti pUlu
kaarabbaMti pUlu
SaMkhaM pUlu
mudda baMti puulu

Vanne vannela puulu
eMchii eMchii techchi
ErEri techchaamu batakammaa!
siMgaariMpulu nIvi!
kanula paMDuga maadi !

aparaMji paLLemula
aMchelaMchelugaanu
apuruupamugaa techchi
kUrchi , kaTTinaamu mEmu
aMdaala pUla mEDa
talli batukammaku!

batukamma maa yamma !
baMgaaru gauramma !
maaiMTa koluvavvaga
raayaMcha naDakalato
eMchakkaa raavammaa
baMgaaru gauramma!

batukamma! batukamma! uyyaalO!
baMgaaru gauramma uyyaalO!
raacha vaari pOri! ratanaala bommaa!
challaMga nUrELLu vardhillavammaa!

batukamma! batukamma! uyyaalO!
baMgaaru gauramma uyyaalO!

{ printed in
“Telugu people “
Magazine , October 2008 }

దాగుడు మూతలు, దోబూచుల ఆటలు





















మర్రి ఆకు పానుపున
అనంతమౌ కడలి పైన
ఆనంద మోహనా!
తేలాడుచు రావోయీ!
చిన్ని క్రిష్ణ! రావయ్యా!

బృందావన మందున
మల్లెల పొదరిళ్ళలోన
పొగడ, పొన్న,మద్ది, జంబూ
తరువుల క్రీనీడలలో ...........

తులసి గుబురు మొక్కలందు
రాధా మాధవ లతలు,
జాజి పందిరుల మాటున
దాగుడు మూతలు బాగ
ఆడందా రావోయీ!చిన్ని క్రిష్ణ!

మావి, జమ్మి తోపులలో
దోబూచుల ఆటలు

వంశి, ఇక్షు వనములలో
దోబూచుల ఆటలు

వెదురు మురళి కన్నయ్యకు;
చెరకు గడలు దుర్గమ్మకు!
By kadambari piduri, Oct 18 2010 6:38AM]

Tuesday, October 12, 2010

శ్రీ శారదా దేవి - ప్రార్ధన













సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
పద్మ పత్ర విశాలాక్షీ పద్మ కేసర వర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాంపాతు సరస్వతీ !

బతుకమ్మ దీవెనలు















ఇంతులూ, పిల్లలూ, ముద్దరాళ్ళు
బంగారు కలశాల - భమిడి పళ్ళాలలో
బతుకమ్మ పూ మేడలను కట్టి తెచ్చేరు
దసరాకు సంబరం పిలుపు పేరంటం ||

తంగేడు పూలనూ తీర్చి పేర్చేరమ్మ –
రంగుగా, హంగుగా తల్లి బతుకమ్మా!

బీర పువులూ, కట్ల పువులు, బంతులనూ
నేర్పుగా పేరుస్తు గద్దియను కట్టేరు

సూర్య కిరణ కోటి, చంద్ర కాంతులునూ
ఏడు వరుణాల హరి విల్లులున్నూ
పోటీలు పడుతూను ఈ పూల కురిచీల - పయి
నెక్కి కూర్చుంటాయి

బంగారు, మణి రత్న, నెమలి సింహాసన్లు
ఈ సుకుమార చక్కనీ గద్దె సాటికి రావు

అమ్మ మా బతుకమ్మ! ఆసీనవై మమ్ము
కమ్మనీ నవ్వులతొ దీవెనల నీవమ్మ!
**************************************
iMtuluu, pillaluu, muddaraaLLu
baMgaaru kalaSAla - BamiDi paLLAlalO
batukamma pU mEDalanu kaTTi techchEru
dasaraaku saMbaraM pilupu pEraMTaM ||

taMgEDu pUlanuu tiirchi pErchEramma –
raMgugaa, haMgugaa talli batukammaa!

bIra puvuluu, kaTla puvulu, baMtulanuu
nErpugaa pErustu gaddiyanu kaTTEru

sUrya kiraNa kOTi, chaMdra kaaMtulunuu
EDu varuNAla hari villulunnuu
pOTIlu paDutUnu I puula kurichIla - payi
nekki kUrchuMTAyi.

baMgaaru, maNi ratna, nemali siMhaasanlu
I sukumaara chakkanii gadde saaTiki raavu

amma maa batukamma! aasiinavai mammu
kammanI navvulato dIvenala nIvamma!

*******************************************

Sunday, October 10, 2010

వర దాయినీ!














రజతాద్రి వాసుని హృదయ రాణీ!
వారిజ నేత్రి!వర దాయినీ!
శుభ కారిణీ! ప్రణతులమ్మా! ||

ఆది శక్తీ! దివ్య సౌభాగ్య దామినీ!
నీ మోహనమ్మౌ మూర్తి నెలవులుగా మారిన
మోద పూర్ణములాయె మా వీక్షణములు ||

దేవి! జగద్ధాత్రి! శ్రీ గౌరి, మాణిక్యాంబ!
ఈ వసుధా తలమున నీ అనుగ్రహములు
కారుణ్య వర్షిత చంద్రికల పరి వ్యాప్తి ||

శుభ మంగళములు ఇవ్వు అమ్మా!














నగ రాజ పుత్రికా!
ఇంద్ర కీల నగ రాజ్య సామ్రాజ్ఞి! ఆది శక్తీ!దేవి!
ఆదరమ్మున శుభ మంగళములిమ్మా! ||















ఆ – దివికి పరచిన ఛత్రమ్ము నీవే!
"మే - దిని"కి దివ్య హరితాంబరము నీవే!
ఆదరమ్మున శుభ మంగళములిమ్మా! ||

వాసంత పరిమళ మలయ వీచీ!
భవాని! శాంభవి! జగజ్జననీ!
ఆదరమ్మున శుభ మంగళములిమ్మా! ||

Friday, October 8, 2010

బొమ్మల పెళ్ళిళ్ళు, వేడుకలు















దోస గింజ బొట్లు పెట్టి
సోగ కళ్ళ కాటుకెట్టి
బయలు దేరారండీ
బంగారు బాలికలు

బుట్ట గౌన్లు తొడుక్కునీ
పట్టు పావడాలతో
వయ్యారాల్ చిలికిస్తూ
బయలు దేరారండీ
మా మంచి పాపాయిలు
చొక్కయీ లేసుకునీ
మరమరాలు, పుట్నాలు
లౌజు, జంతికలతోటీ
బొమ్మల పెళ్ళిళ్ళు చేయ
బయలు దేరారండీ

టిక్కు టాకు, ఠీవిగాను
బయలు దేరారండీ
బాల బాలికలతోటి
బొమ్మల పెళ్ళి వేడుక
చూసేందుకు పెద్దలు

లక్క పిడతలు, విందులు
వినోదాల బాల్యాలు
షడ్రుచుల భోగాలు ;
బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ
అల నాటి తీపి గురుతులు

************************

dOsa giMja boTlu peTTi
sOga kaLLa kaaTukeTTi
bayalu dErAraMDI
baMgaaru baalikalu;;;;

buTTa gaunlu toDukkunii
paTTu paavaDaalatO
vayyaaraal chilikistU
bayalu dErAraMDI
maa maMchi paapaayilu
chokkayii lEsukunI
maramaraalu, puTnAlu
lauju, jaMtikalatOTii
bommala peLLiLLu chEya
bayalu dErAraMDI

Tikku TAku, ThIvigaanu
bayalu dErAraMDI
baala baalikalatOTi
bommala peLLi vEDuka
chUsEMduku peddalu

lakka piDatalu, viMdulu
vinOdaala baalyaalu
shaDruchula BOgaalu ;
bommala peLLiLLu chEstU
ala nATi tIpi gurutulu ;;;;;

***********************************

1. "పిల్లల పేర్లు " సెలక్షను చేస్తున్నారా!!!!
ఇక్కడ ఇంటర్నెట్టు సదుపాయాలలో బ్లాగును చూడండి.

షోడశ కళల రాణి














వారిజాక్షీ!కనక దుర్గమ!
హారతులను అందుకోవమ్మా!
అను రాగ హారతులను అందుకోవమ్మా! ||

నీల కుంతల రాణి! జననీ!
నీ అలకల కడ శిష్యులై
జలధరమ్ముల వన్నియలతో
అలలు నాట్యము నేర్చునమ్మా!
అలలు నాట్యము నేర్చునమ్మా ||

చిలుక పలుకుల ముద్దు
చిలికెడి నీదు వాక్కులు
చలన భావమ్ములను
కావ్యమ్ములుగ తీర్చి దిద్దునమ్మా!
కావ్యములుగ మార్చునమ్మా! ||

జనని కనక దుర్గ














కదంబ సుమ వనమ్ములందున
పరీమళమ్ముల వాహినీ!
రత్న మణి హార ధారిణీ! -
మా జనని దుర్గమ్మ!
అందుకోవమ్మా మా నమస్సులు! ||

శుక శౌనకాది వర్ణిత!
సకల లోక వందిత!
జలధి వర్ణపు సుగాత్రీ!
విలసత్ రజిత వాస విలాసినీ!
మా జనని దుర్గమ్మ!
అందుకోవమ్మా మా నమస్సులు! ||

ముకుళ సుమ దళ పల్లవాంగుళి
సకల లోకము రాగ వీణ్ల
అను రాగ ధారా వర్షిణీ!
అభీష్ట వర ప్రదాయినీ!
అందుకోవమ్మా మా నమస్సులు! ||

Thursday, October 7, 2010

గడుగ్గాయిలు,తాత ముచ్చట్లు























[తాత]:
చిట్టి పాపా! చిన్ని బాబూ!
బొమ్మలు ఏవీ చూపించండి! ||
[బాల బాలికలు ]:
బార్బీ, డిస్నీ, లక్క పిడతలు
బాలు,బ్యాటు, నిర్మల్ బొమ్మలు
ఆడీ ఆడీ – ఇపుడే అటకను సర్దేశాము

[తాత]:
చిన్న బాబూ! చిట్టి బాలా!
మీ బుక్కులు ఏవీ? ఎక్కడ ఉన్నయ్?
విజ్ఞానానికి అవి ప్రతీకలు ||

[బాల బాలికలు ]:
కార్టూన్, కామిక్స్, నీతి గాథలు
పద్యాల్, పాటలు,సైన్సు, లెక్కలు
అన్నీ నేర్చి, అలమర్లో సర్దేసాము ||

[తాత]:
పళ్ళు, ఫలాలు, ఫలహారాలూ
ఎక్కడ ఉంచారోయి గడుగ్గాయిలూ!
[బాల బాలికలు ]:

బాదం, పిస్తా, డ్రై ఫ్రూటులు
శ్రీ రాముల నేస్తం – బుల్లి ఉడుతకు;

నవ ధాన్యాలు గువ్వ, పిచుకలకు;
పెరుగు కడీలు పుస్సీ క్యాటు పిల్లికి;

దోర జామలు రామ చిల్కలకు;
బుజ్జగిస్తూ మరి తినిపించాము ||

[తాత]:
“ స్వీటు హాటులూ, అప్పచ్చు లరిసెలు
చప్పరింపుల చాక్లెట్లూ
మరి నాకేవీ మనవళ్ళూ!” ||

[బాల బాలికలు ]:
“జొన్న కండెలు, జంతిక, చెక్కలు
బోసి నోటి తాతా! ఇవిగో!
అన్నీ నీకే!భుజించవయ్యా!” ||

[తాత]:
“నమలడానికి పళ్ళే లేవు;
మీ పరిహాసాలు ఎంతో ముద్దు!
బొజ్జ నిండుగా హాస్యపు విందులు
నాకు చాలును, అవె పది లక్షలు!”
సరదా సరదా తీపి పలుకులు