Saturday, October 30, 2010

రావి ఆకు చిత్రాలెన్నో!
రావి ఆకులను తెచ్చీ
నీళ్ళలోన నానబెట్టీ
ఆనక......
బాగుగాను ఎండ బెడితె
సిద్ధం!సిద్ధం!

కుంచెలూ, రంగులూ
సిద్ధం! సిద్ధం!
బాల బాలికల దుస్తులన్ని ఖరాబు
పిల్లల ఒళ్ళు, ఇల్లు ఏకమవగ
ఆకు చిత్రాలెన్నో
సిద్ధం! సిద్ధం!

రావి పత్రాల పైన
ఎన్నెన్నో బొమ్మలు!
బుల్లి క్రిష్ణ! రావయ్యా!
బొమ్మలను నీకిస్తే
మధు మురళి గానమును
లోకాలకు ఒసగుమోయీ!

No comments:

Post a Comment