Sunday, October 24, 2010

దాగుడు మూతలు, దోబూచుల ఆటలు

మర్రి ఆకు పానుపున
అనంతమౌ కడలి పైన
ఆనంద మోహనా!
తేలాడుచు రావోయీ!
చిన్ని క్రిష్ణ! రావయ్యా!

బృందావన మందున
మల్లెల పొదరిళ్ళలోన
పొగడ, పొన్న,మద్ది, జంబూ
తరువుల క్రీనీడలలో ...........

తులసి గుబురు మొక్కలందు
రాధా మాధవ లతలు,
జాజి పందిరుల మాటున
దాగుడు మూతలు బాగ
ఆడందా రావోయీ!చిన్ని క్రిష్ణ!

మావి, జమ్మి తోపులలో
దోబూచుల ఆటలు

వంశి, ఇక్షు వనములలో
దోబూచుల ఆటలు

వెదురు మురళి కన్నయ్యకు;
చెరకు గడలు దుర్గమ్మకు!
By kadambari piduri, Oct 18 2010 6:38AM]

No comments:

Post a Comment