Friday, October 8, 2010

బొమ్మల పెళ్ళిళ్ళు, వేడుకలు















దోస గింజ బొట్లు పెట్టి
సోగ కళ్ళ కాటుకెట్టి
బయలు దేరారండీ
బంగారు బాలికలు

బుట్ట గౌన్లు తొడుక్కునీ
పట్టు పావడాలతో
వయ్యారాల్ చిలికిస్తూ
బయలు దేరారండీ
మా మంచి పాపాయిలు
చొక్కయీ లేసుకునీ
మరమరాలు, పుట్నాలు
లౌజు, జంతికలతోటీ
బొమ్మల పెళ్ళిళ్ళు చేయ
బయలు దేరారండీ

టిక్కు టాకు, ఠీవిగాను
బయలు దేరారండీ
బాల బాలికలతోటి
బొమ్మల పెళ్ళి వేడుక
చూసేందుకు పెద్దలు

లక్క పిడతలు, విందులు
వినోదాల బాల్యాలు
షడ్రుచుల భోగాలు ;
బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ
అల నాటి తీపి గురుతులు

************************

dOsa giMja boTlu peTTi
sOga kaLLa kaaTukeTTi
bayalu dErAraMDI
baMgaaru baalikalu;;;;

buTTa gaunlu toDukkunii
paTTu paavaDaalatO
vayyaaraal chilikistU
bayalu dErAraMDI
maa maMchi paapaayilu
chokkayii lEsukunI
maramaraalu, puTnAlu
lauju, jaMtikalatOTii
bommala peLLiLLu chEya
bayalu dErAraMDI

Tikku TAku, ThIvigaanu
bayalu dErAraMDI
baala baalikalatOTi
bommala peLLi vEDuka
chUsEMduku peddalu

lakka piDatalu, viMdulu
vinOdaala baalyaalu
shaDruchula BOgaalu ;
bommala peLLiLLu chEstU
ala nATi tIpi gurutulu ;;;;;

***********************************

1. "పిల్లల పేర్లు " సెలక్షను చేస్తున్నారా!!!!
ఇక్కడ ఇంటర్నెట్టు సదుపాయాలలో బ్లాగును చూడండి.

No comments:

Post a Comment