Friday, October 8, 2010

షోడశ కళల రాణి


వారిజాక్షీ!కనక దుర్గమ!
హారతులను అందుకోవమ్మా!
అను రాగ హారతులను అందుకోవమ్మా! ||

నీల కుంతల రాణి! జననీ!
నీ అలకల కడ శిష్యులై
జలధరమ్ముల వన్నియలతో
అలలు నాట్యము నేర్చునమ్మా!
అలలు నాట్యము నేర్చునమ్మా ||

చిలుక పలుకుల ముద్దు
చిలికెడి నీదు వాక్కులు
చలన భావమ్ములను
కావ్యమ్ములుగ తీర్చి దిద్దునమ్మా!
కావ్యములుగ మార్చునమ్మా! ||

No comments:

Post a Comment