Sunday, October 10, 2010

శుభ మంగళములు ఇవ్వు అమ్మా!


నగ రాజ పుత్రికా!
ఇంద్ర కీల నగ రాజ్య సామ్రాజ్ఞి! ఆది శక్తీ!దేవి!
ఆదరమ్మున శుభ మంగళములిమ్మా! ||ఆ – దివికి పరచిన ఛత్రమ్ము నీవే!
"మే - దిని"కి దివ్య హరితాంబరము నీవే!
ఆదరమ్మున శుభ మంగళములిమ్మా! ||

వాసంత పరిమళ మలయ వీచీ!
భవాని! శాంభవి! జగజ్జననీ!
ఆదరమ్మున శుభ మంగళములిమ్మా! ||

No comments:

Post a Comment