Tuesday, May 11, 2010

సీతా కోక చిలకల వలె ఆడుదాము






















కొలనులలో తరగలు – నదులందున ఎన్నో అలలు
కడలిలోన కెరటాలు – నీటి వలయ నాట్యాలు;

తరంగాల నురుగులు – నురుగు బుడగ పువ్వులు
దేవతలు వెలిగించిన - వెన్నెలల దీపాలు

బాలల డెందాలలోన ఎన లేని హర్షమ్ములు
పిన్న, పెద్దలందరికీ నేత్ర పర్వ కేరింతలు

అరుణ కాంతి మిల మిలలు – పౌర్ణిమల జ్యోతులు
వెలుతురుల సిరి మల్లెలు – విర బూసే తోటలివి ,
అందరమూ ఆడుదాము సీతా కోక చిలకలమై.

((సీతా కోక చిలకల వలె ఆడుదాము ;

( = నురుగులపై దివ్వెలు )

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

(siitaa kOka chilakala vale aaDudaamu ;

(= nurugulapai divvelu ; )
____________________

kolanulalO taragalu – nadulaMduna ennO alalu
kaDalilOna keraTAlu – nITi valaya naaTyaalu;

taraMgaala nurugulu – nurugu buDaga puvvulu
dEvatalu veligiMchina - vennelala diipaalu
baalala DeMdaalalOna ena lEni harshammulu
pinna, peddalaMdarikii nEtra parva kEriMtalu

aruNa kaaMti mila milalu – paurNimala jyOtulu
veluturula siri mallelu – vira bUsE tOTalivi
aMdaramuu aaDudaamu sitaa kOka chilakalamai.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment