Thursday, May 27, 2010

వర్ష ధారల అత్తర్లు


పురి విప్పార్చిన నెమలి పింఛములా
అవిగో! అవిగో! కారు మబ్బులు;
ఆత పత్రము = umbrellaa
తీసుకు రండి తొందరగా!

చండా మొండీ వర్షం వచ్చెను
పడిసం పట్టును ; జలుబూ చేయును
ఆరోగ్యమె సౌభాగ్యము కద!
రెయిన్ కోటులను ధరియించండీ!

( పిల్లలు) :::

ఓహో వర్షం, ఆహా! హర్షం!
వాన జల్లుల అత్తరు, పన్నీర్లు
వాన బాలకు కేరింతలమై
తడిసి, తనియుతాం, ఆట లాడుతాం

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment