Saturday, May 8, 2010

ఒహో! ఒహో! పావురమా!


















కపోతమా! తెలుపవే
సమాచారము
స్వామి సమాచారము ||

పద్మావతి కవ్వించి
నాంచారు నవ్వించి
శ్రీ వేంకట నాథుని మోము చిన్నెలన్ని
చూచి , పులకించి –
దినమణి ‘ ఇల కొసగినాడు ఈ నాడు
కోటి కిరణ రాశి గా పగటిని “ ||

అలివేలు మంగ కెంపు పెదవి –
వంపుల శ్రీ చుట్టి
చిలిపి హాసముల నెన్నెన్నో –
గిరి వాసుడు సృజియించెను, ఓహోహో!

అది గనిన పద్మాసన –
శ్రీ లక్ష్మి ఇటుల తలచె!
నాదు శ్రీ’ని సవతి కడను
దాచినాడు రమణుడు –
మెండు కదా మగని పొగరు ,
ఏమని అనుకోను?!!??” ||

అయ్యారే! ఆ ఇంతులు
శ్రీవారి సరసాల తంతులలో
ఇంపులు, గడసరి కవ్వింపులు,
ప్రణయాలలొ వింతలు ||

&&&&&&&&&&&&&&&&&&


ohO! ohO! paavuramaa! ;
__________________
kapOtamaa! telupavE
samaachaaramu
svaami samaachaaramu ||

padmaavati kavviMchi
naaMchaaru navviMchi
SrI vEMkaTa naathuni mOmu chinnelanni
chuuchi , pulakiMchi –
dinamaNi ‘ ila kosaginaaDu I naaDu
kOTi kiraNa rASi gaa pagaTini “ ||

alivElu maMga keMpu pedavi –
vaMpula SrI chuTTi
chilipi haasamula nennennO –
giri vaasuDu sRjiyiMchenu, OhOhO!

adi ganina padmaasana –
SrI lakshmi iTula talache!
naadu SrI’ni savati kaDanu
daachinaaDu ramaNuDu –

#meMDu kadaa magani pogaru ,
Emani anukOnu?!!??” ||
ayyaarE! aa iMtulu
SrIvaari sarasaala taMtulalO
iMpulu, gaDasari kavviMpulu,
praNayaalalo viMtalu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment