Saturday, May 29, 2010

చక్రబంధమేసింది కొండగాలి


చక్రబంధమేసింది కొండగాలి,
భక్తులతో పోటీ పడి, ప్రదక్షిణముల||

నీరదముల చామర, వింజామరల నుండి
శ్రీకరముగ బయలుదేరి సుతారముగ
ఓరకంట గోవర్ధనగిరి పిలువ, వద్ద చేరి
లోయ, సొరంగాల నుండి దూరిదూరి||

యమునా జలములలో రాసలీల
మైమరపుల రమణీ కృష్ణుల చుట్టూ
వలయములౌ నీళ్ళ జేరి
మృదు గమనమ్ముల గమ్మత్తుగ||

మధురాపురి ఊసులను – వ్రేపల్లియ ముచ్చట్లను
కలబోసి, కలనేతల– అల్లి బిల్లి కబురులల్లి
కవుల మదిని సంచరిస్తు – హడావుడిగ||

&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela

చక్రబంధమేసింది కొండగాలి

By kadambari piduri, May 17 2010 3:50AM

No comments:

Post a Comment