మిణుగురు పులుగులను
తన దోసిట్లో పట్టుకోవాలని
చూస్తూన్నాడు - "రేయి పురుషుడు ";
నింగికి మెలకువ వచ్చింది కాబోలును,
మెల మెల్లగా తెలి మంచు పరదాలను తొలగించుకుంటూ
ఉదయ కిరణాల వెంట్రుకలను సరి చేసుకుంటూ
నలు దిక్కులా కలయ జూస్తూ
బద్ధకాన్ని వదిలించుకుంటూ
ధరిత్రి కేసి వంగి చూసాడు;
భువన మనోహరత్వం
కావ్యత్వమై పులకిస్తూన్నది;
“హైలెస్సా! హైలెస్సా!” పదాలు
కొసరంచు ముగ్గులను చిత్రిస్తూ ఉన్నవి;
అల్లెక్కడి నుండో వస్తూన్న
మృదు నవ మురళీ రవళిని
గూటి పడవ - తన ఆంతరంగంలో రంగరించుకుంటూ
ముందుకు సాగుతూంటే .........
యమునా వాహిని
కృష్ణుని అల్లరల్లరి నాట్య లీలలను ;
నిన్న జరిగిన ఊసులను చెబుతూంటే;
ఆ ముచ్చట్లతో .........
'పైర గాలి ' వయ్యారాలు పోతూ
'కొంగ్రొత్త రంగ వల్లికలుగా 'ఆవిష్కారమౌతూన్న వేళలలో
రాధిక సోలిన కన్నుల వీక్షణాలు
వెలుతురు సరసులలో
పద్మాలై విరబూస్తున్నాయి.
( హైలెస్సా పదాలతో
అల్లుకున్న వేణు రవము )
&&&&&&&&&&&&&&&&&&
( hailessaa padaalatO
allukunna vENu ravamu )
miNuguru pulugulanu
tana dOsiTlO paTTukOvaalani
chUstUnnaaDu rEyi purushuDu;
niMgiki melakuva vachchiMdi kaabOlunu,
mela mellagaa teli maMchu paradaalanu tolagiMchukuMTU
udaya kiraNAla veMTrukalanu sari chEsukuMTU
nalu dikkulaa kalaya jUstU
baddhakaanni vadiliMchukuMTU
dharitri kEsi vaMgi chUsaaDu;
bhuvana manOharatvaM
kaavyatvamai pulakistUnnadi;
“hailessaa! hailessaa!” padaalu
kosaraMchu muggulanu chitristU unnavi;
allekkaDi nuMDO vastUnna
mRdu nava muraLI ravaLini
gUTi paDava tana aaMtaraMgaMlO raMgariMchukuMTU
muMduku saagutUMTE
yamunaa vaahini
kRshNuni allarallari naaTya lIlanu
ninna jarigina Usulanu chebutUMTE;
aa muchchaTlatO
paira gaali vayyaaraalu pOtU
koMgrotta raMga vallikalugaa aavishkaaramautUnna vELalalO
raadhika sOlina kannula vIkshaNAlu
veluturu sarasulalO
padmaalai virabUstunnaayi.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment