Sunday, May 16, 2010

మలయ మారుతముల ప్రదక్షిణలు























( పల్లవి)

చక్ర బంధమేసింది కొండ గాలి
భక్తులతో పోటీ పడి ||

1. నీరదముల చామర, వింజామరల నుండి
శ్రీకరముగ బయలు దేరి సుతారముగ
ఓర కంట గోవర్ధన గిరి పిలువ, వద్ద చేరి
లోయ, సొరంగాల నుండి దూరి దూరి ||

2. యమునా జలములలో రాస లీల –
మై మరపుల రమణీ కృష్ణుల చుట్టూ
వలయములౌ నీళ్ళ జేరి
మృదు గమనమ్ముల గమ్మత్తుగ ||

3. మధురా పురి ఊసులను – వ్రేపల్లియ ముచ్చట్లను
కల బోసి, కల నేతల – అల్లి బిల్లి కబురు లల్లి
కవి మానసమున సంచరిస్తు – హడావుడిగ ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
malaya maarutamula pradakshiNalu ;
_______________________________
( pallavi):::::
_______
chakra baMdhamEsiMdi koMDa gaali
bhaktulatO pOTI paDi ||

1. nIradamula chaamara, viMjaamarala nuMDi
SrIkaramuga bayalu dEri sutaaramuga
Ora kaMTa gOvardhana giri piluva, vadda chEri
lOya, soraMgaala nuMDi dUri dUri ||

2. yamunaa jalamulalO raasa lIla –
mai marapula ramaNI kRshNula chuTTU
valayamulau nILLa jEri
mRdu gamanammula gammattuga ||

3. madhuraa puri Usulanu – vrEpalliya muchchaTlanu
kala bOsi, kala nEtala – alli billi kaburu lalli
kavi maanasamuna saMcharistu – haDaavuDiga ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment