Friday, May 28, 2010

నీలముపై పగడము


















మౌళి పింఛము వాని పెదవుల
భావ గర్భిత మంద హాసము
ఇంద్ర నీలము మేని ఛాయల
ఒదిగినట్టి పగడ మెవరే???
ఆ మణి ప్రవాళ మెవరే??

(చెలులు):::
__________
“ ఇంకెవ్వరమ్మా! రాధిక !”

1. ప్రణయ దృక్కులు జతలు జతలుగ
అల్లుకున్న తోరణమ్ములు
కెంపు, నీలము కన్నయ్య, రాధిక
ఇంపు పెంపుల రాగ మాలిక ||

2. కళా సీమలకీ జోడీ
సరిగ పోగుల చాందినీ
సకల హర్షామోద ద్యుతి తతి
స్వర్ణ కానుకలీ పుడమి తల్లికి ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

nIlamupai pagaDamu ;
__________________

mauLi piMCamu vaani pedavula
BAva garBita maMda haasamu
iMdra nIlamu mEni CAyala
odiginaTTi pagaDa mevarE???
aa maNi pravaaLa mevarE??

(chelulu):::
__________
“ iMkevvarammaa! raadhika !”

1. praNaya dRkkulu jatalu jataluga
allukunna tOraNammulu
keMpu, nIlamu kannayya, raadhika
iMpu peMpula raaga maalika

2. kaLA siimalakI jODI
sariga pOgula chaaMdinI
sakala harshaamOda dyuti tati
svarNa kaanukalI puDami talliki ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No comments:

Post a Comment