Tuesday, February 7, 2012

చిందు గోపాలం! సందె గోపాలం!



అందునా, నేనందునా!

;
బాలకృష్ణుడు వీడు ఇడుగో!
తన ప్రతి హేల- లీలా బింబమవగా;

అందునా, నేనందునా!?
చిందు గోపాలం! సందె గోపాలం!  ||

ఇంత కోపాలెందుకంటా!
అంతటీ సణుగుడులు, చిరు బుర్రులూ
అడగగానే యశోదమ్మ;
నెమలి ఈకలు ఇవ్వలేదని.....
||చిందు గోపాలం! సందె గోపాలం!||

గొణుగుడు, గుణుపు అలకలు;
ఎందుకోయీ? తెలుపవోయీ!
కుండ గోకుడు గోదావరి-
పిన్ని రోహిణి ఇవ్వలేదని
||చిందు గోపాలం! సందె గోపాలం!||
;

దోబూచులాటల మేటి క్రిష్ణుడు;
అందు వీడే! ఇందు వీడే!
వేరె నీకై వెదుకనేల?
సర్వంతర్యామివి నీవేనయా!
||చిందు గోపాలం! సందె గోపాలం!

           అందునా, నేనందునా!? ||

No comments:

Post a Comment