Friday, February 24, 2012

ఇరుక్కున్న ముక్కు


Beaverton City Library


చిలక చిలక, రామ చిలుక;
ముక్కు మీద టెక్కు కోపం; 
కోపం, అలుక కుప్పలు అయ్యి; 
ముక్కు కాస్తా ఎర్రన ఆయెను;

ఎర్రన, తిమ్మన- 
ముక్కు కవితలకు; 
అల్లికలెన్నో అందించినది 
రాచిలకమ్మ చిన్ని నాసిక

ఎర్రని -అలకల- కినుకల శుకము 
దోర జామ పళ్ళను చూసీ……….
చూసీ, చూడగనే…….. 

Q:- ఆ! ఏం చేసినది? 
     ఆహాహా! ఏమి చేసినది?

జామ కాయను కొరికె కసుక్కున;
పండులొ ముక్కు ఇరుక్కున్నది
జామ కాయను కొరికె కసుక్కున;
పండులొ ముక్కు ఇరుక్కొన్నది! 

కొమ్మలొ కోతి నవ్వె కిసుక్కున!                         
హ్హి హ్హి హ్హీ! వ్వె వ్వె వ్వే!
వెక్కిరింతల కోతికి డిల్లా!
చక్కిలిగింతల జిల్లాయీలు!

                      (అందరూ నవ్వుతారు)

హ్హి హ్హి హ్హీ! వ్వె వ్వె వ్వే!

]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]
Published On Friday, February 10, 2012 By ADMIN. 
Under: ఆట - పాట, పాటలు. 
రచన  : కాదంబరి పిదూరి


No comments:

Post a Comment