Monday, February 27, 2012

గురు శిష్య పరంపర


;
నీలాల మేఘాలు దడబిడా వచ్చేయి;
ఆకసములోన ఆగమాగం చేస్తు, అల్లరిగ తిరిగేను;
మొయిళులను సాగరుడు పరికించి
చల్లనీ గాలులను పంపేడు;

శీఘ్రమే అవి వెళ్ళి, మబ్బులకు చెప్పాయి
"మలయ పవనాలము; మమ్ము మీ గురువులుగ,
నియమించినాడు జల దేవుడు"
గాలులకు శిష్యులై, మబ్బులు నేర్చాయి;
ఉరుముల గీతములు, మెరుపుల కావ్యములు;

ఇన్ని విద్యలు తెలిసి ఉన్నట్టి జలదములు,
అందరి మన్ననల నించక్క పొందాయి;

చినుకుల బాలురు నీరదమ్ముల విద్యార్ధులైనాయి;
వాన చినుకులు వైన వైనాలుగా;
మడుగు, చెరువులు, ఏరు, జలనిధుల నెన్నిటినొ;
వసుధ జననికి ఒసగ; 
ధరణి మృదు హాసముల సకల ప్రాణులకును, 
హర్షాతిశయ దివ్య దీవెనలు ఒసగేను! 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No comments:

Post a Comment