కొండల దేవరా! కొలువునకు వేళాయె!
కొలువు తీరగ స్వామి! తీరుగా రావోయి!
మా కన్నులందున నీవున్న దృశ్యాలు;
ఉన్నత శోభల బొమ్మల కొలువులు! ||మా కన్నులందున||
నీ తీపి పలుకులలొ సతి సోగ చూపులు;
కుదురుగా ఉయ్యాల లూగుచుండంగా;
కొండల దేవరా!
కొలువునకు వేంచేయ- మరచినావేమో!?
ఔరౌర!గొబ్బున రావోయి! ||మా కన్నులందున||
సోమరిపోతు అయి; విహగ రాజు అటనె;
మబ్బు పీఠము పైన కూర్చుండి పోయేనొ?
గరుడ వాహన!
నీవు, కొలువునకు రాకుండ ఇంటనే ఉన్నావ!?
ఔరౌర! వేగమే రావోయి! ||మా కన్నులందున||
ఆదిశేషుడు క్షీర ; సంద్రమ్ములోనే;
మత్తుగా కూళయై; బబ్బుండిపోయేనొ?;
పన్నగ శయనుడా!
కొలువునకు దయ సేయ- బద్ధకిస్తున్నావా?
ఔరౌర! దబ్బున రావోయి! ||మా కన్నులందున||
&&&&&&&&&&&
No comments:
Post a Comment