జాతర! జాతర! జాతర! ;
గలగలల జాతర! ||
గోదారి, క్రిష్ణ వేణి, గంగమ్మ ఉరకలు
గౌతమీ కిన్నెరల కెరటాల తీవెలపై
వీణా గానములను వినిపించుము! వెన్నెలా! ||
తుంగభద్రా ఝరిలో జలకాలు ఆడుతూ
ముచికుందా కెరటాల మురిపాల సాగుతూ
ఉర్వికి వేంచేయండి ప్రాగ్ ఉదయ కిరణమ్ములార!
నాగావళి, పినాకినీ వాహినీ పద ముద్రల
గగన నీలిమలు శోభిలు నర్తనములు సేయగా
ప్రకృతియై తనరండీ సకల సౌందర్యాలూ! ||
No comments:
Post a Comment