Tuesday, August 30, 2011

గృహ సీమ


చక్రవర్తులాలు

ఓంకార బిందు కేళి
శ్వేత వర్ణా0బరం సుందరం 
అను రాగ తోరణములను 
కట్టుటకు అనువుగా 
ద్వారమిది హృదయం .

రంగు రంగుల పూవులు 
ఆలు మగలు, పిల్లల నవ్వులు 
గృహము స్వర్గ సీమ
బృందావనము 

Monday, August 29, 2011

వ్యత్యస్త చిత్రములు

మురిపెముల క్రిష్ణుడు















వ్యత్యస్త చిత్ర చిత్రములను రాసినాడు క్రిష్ణుడు
చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు  ||

పాలలోన దోసిళ్ళను తిప్పి తిప్పి-
తేలాడే మీగడలను అరచేతను పట్టినాడు
చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు ||

పెరుగులనూ జున్నులనూ- పిడికిళ్ళతొ జవిరి పట్టి,
మురిపెముగా మేనెల్లా పూసుకున్నాడు చూడు!
చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు||

తరిపి పాల జున్ను గడ్డలన్ని;
మూతి మోము అంతటా తురుముకున్న వైనాలు;
పాల కడలి  తేలాడెను నీలి నింగి పైన నేడు;

||వ్యత్యస్త చిత్ర చిత్రములను రాసినాడు క్రిష్ణుడు
    చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు  ||

&&&&&&&&&&&&&&&&&&&&

vyatyasta chitra chitramulanu raasinaaDu krishNuDu
chinni krishNuDu mana chinnaari krishNuDu       ||


paalalOna dOsiLLanu tippi tippi-
tElaaDE mIgaDalanu arachEtanu paTTinaaDu;
chinni krishNuDu mana chinnaari krishNuDu ||

perugulanuu junnulanuu- piDikiLLato javiri paTTi,
muripemugaa mEnellaa pUsukunnaaDu chUDu!
chinni krishNuDu chinnaari krishNuDu  ||vya||






Sunday, August 28, 2011

ప్రకృతి మన దేవత






















ప్రకృతి అణువణువుతో - నిత్య సావాసము-
నీవు నేర్పిన విద్య - గోవర్ధనోద్ధారి! గోపాల క్రిష్ణయ్య! ||

అద్రి పూజలను మాకు నేర్పినావు క్రిష్ణ!
“భద్రంగ చేయాలి- గిరి తరువు సంపదలు!
ప్రకృతి మన దేవత" అని సెలవిచ్చినావు;   ||

"ఆలమంద, పశువులు- ఆలనా పాలనలు
మేలైన అలవాటు మందికి!"- అంటివి
జల యమున ఆరాధ్య దేవతని నీ వాక్కు ||

నాట్య నెమలి కనులు – నీ సిగలోని పూవులు;
పక్షులతో ఆటలు కంటి విందులు;
"ప్రకృతియె దేవత"ని సెలవిచ్చినావు;    ||

ప్రకృతి అణువణువుతో - నిత్య సావాసము-
నీవు నేర్పిన విద్య గోవర్ధనోద్ధారి! గోపాల క్రిష్ణా!   ||


   [ప్రకృతి మన దేవత    20 Jul 2011 ]

Saturday, August 27, 2011

గడుసరి వయ్యారము


రాధే క్రిష్ణ














సయ్యాటలాడుచున్నది రాధిక;
వయ్యారము గడుసరిది!
తోయజాక్షి సొగసులలో
హొయలుగ తను మారినది  ||

తన కదలికల పర్ణకుటిని;
ఓహోహో! వయారమా!
ఎపుడు చేరినావు నీవు,
నెయ్యాలతొ అనుమతిని
ఏ తంత్రముతో గొంటివి?
||వయ్యారము గడుసరిది!
  హొయలుగ తను మారినది ||

కానీలను, వరహాలను;  
రాధమ్మకు ఇచ్చినావు?    
"కాని మాటలేల?" అనుచు
కోపగించుకొందువేల- నాపైన

||వయ్యారము గడుసరిది!
  హొయలుగ తను మారినది ||


తన నవ్వుల కడ చేరి    
మువ్వ గీతమైనావు!;      
కను చూపుల గద్దెలెక్కి,    
బాగ తిష్ఠ వేసినావు!
||వయ్యారము గడుసరిది!
  హొయలుగ తను మారినది ||

&&&&&&&&&&&&&&&&
 
        vayyaaramu gaDusaridi! 

sayyaaTalADuchunnadi raadhika;
vayyaaramu gaDusaridi!
tOyajaakshi sogasulalO
hoyaluga tanu maarinadi  ||

tana kadalikala parNakuTini;
OhOhO! vayaaramaa!
epuDu chErinaavu nIvu,
neyyaalato anumatini
E taMtramutO goMTivi? ||

enni kaanIlanu, varahaalanu;
raadhammaku ichchinaavu?
"kaani mATalEla?" anuchu
kOpagiMchukoMduvEla- naapaina ||

tana navvula kaDa chEar
muvva gItamainaavu!;
kanu chUpula gaddelekki,
baaga tishTha vEsinaavu! ||

Friday, August 26, 2011

ములగ చెట్టు ప్రయోజనాలు








ఫ్రికా దేశాలలో ములగ కాయ విత్తనాలతో - కాలుష్య జలములను -
వాడుకునే మంచి నీళ్ళుగా మార్చుతున్నారు.
రుబ్బిన/ గ్రైండ్ చేసిన ములక్కాయ విత్తుల గుజ్జును రెడీ చేస్తారు.
ఆ Moringa seeds పిండిని 2 స్పూన్లు తీసుకుని,
సీసా నీటిలో లో బాగా కలియబెడ్తారు.
ద్రావణము కలుష జలాలను శుద్ధి చేయడానికై ఉపయోగపడ్తుంది.
purify చేయవలసిన నీటిని/ మురికి నీటిని -
ఒక బక్కెట్టు, లేదా పాత్ర, కుండ లో ఉంచాలి.
ఆ కడవకు/ గిన్నెకు ఒక పలుచని వస్త్రాన్ని-
వాసెన గుడ్డలా కట్టాలి.
ముందుగా ఉంచుకున్న
ములక్కాడల సీడ్స్ యొక్క గుజ్జు సారాన్ని
ఆ క్లాథ్ పై పోస్తూ నెమ్మదిగా వడబోయాలి.
ఇలాగ జల్లెడ పట్టిన ద్రావణము కింది గిన్నెలోని
మురికి నీళ్ళలోకి - నెమ్మదిగా కలుస్తుంది.
ఆ రెంటి మిశ్రమాన్నీ బాగా మిళితం చేయాలి.
కొన్ని గంటల సేపు, ఆ నీటిని కదిలించకుండా అలాగే అట్టిపెట్టాలి.
అప్పుడు - మంచి నీరు- మన చేతిలో రెడీ!
ములగ విత్తనాలతో జలశుద్ధి

మొరింగా ఒలియ్ఫెరా (Moringa Oleifera, ) చెట్టును
 ఆఫ్రికా కంట్రీలలో ప్రజలు -మిరక్ల్ ట్రీ- (Miracle tree)అని అభివర్ణిస్తారు.
ఈ ములగ చెట్టు ఆమూలాగ్రమూ ఉపయోగ, ఉపకారియే!
కాయలను మాత్రమే కాకుండా, ఆకులను, పూలనూ/ పూతనూ,
బెరడునూ విస్తృత ప్రయోజనములకు వాడగలుగుతున్నారు.
ఆకుల పొడి వంటలో, ఖాద్య వస్తువులలో మాత్రమే కాక,
వైద్యంగా సైతం వాడబడ్తూన్నది.
ఈ ఆకులపొడిని క్యాప్సూల్సు గానూ,
నూనెను కూడా వినియోగిస్తూన్నారు.
 విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తూన్న స్థాయిలో
ఆయా దేశాలలో ములగ చెట్టు వినిమయం ఔతూన్నది.
దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా అత్యంత వేగంగా -
తమను తాము మలుచుకుని, పెరుగుతూ, నిలదొక్కుకునగలవు వృక్ష జాతి.
ఫ్రికా ఖండములో -ములగ చెట్టు
( అక్కడ, కొన్ని ప్రదేశాలలో  హార్స్ రాడిష్ అనేపేరును కూడా కలిగినది)
మనకు వింతగానే అనిపించవచ్చును కదా!
ఈ ఫొటోలో గమనించండి (Link)
Maldivians people ఇష్టంగా తినే వంటకం Garudiya.
గరుడీయ - అనే సాంప్రదాయ (ములగ) వంటకమును 
మాల్ దీవులలోని ప్రజలకు ప్రీతిపాత్రమైనది.
:::::::::::::::::
మైకా దేశంలో ములగ రెమ్మల, కణుపుల నుండి
నీలి రంగు రసాన్ని తయారు చేసి, వస్త్రాలకు,
అద్దకం వలె వాడుతారు.(In Jamaica, the sap is used for a blue dye.)
బెన్ ఆయిల్ ములగ తరువు నుంది కలిగే ఉత్పాదన.
బెన్ ఆయిల్ ట్రీ - అని దీనిని పిలుస్తున్నారు - అంటే
ఆ తైలం యొక మార్కెట్ పరిధిని ఊహించవచ్చు.
తమిళనాడు, కేరళ ఇత్యాది రాష్ట్రాలలో
ఆయుర్వేద, సిద్ధ వైద్య విధానాలలో
ఈ ములగ నూనె (Ben oil) వాడబడ్తూన్నది.

{ BEN OIL TREE)   ; TreeWater Treatment with Moringa Seeds}

జల శుద్ధి (Link for Essay)



Thursday, August 25, 2011

TamilNadu లో ప్రాచీన Neer Maruthu చెట్టు


Neer Maruthu (Tholkappiar)


2010 జూలై 17 న Nagercoilలో జరిగిన
ఫంక్షన్ లో ఒక విశిష్ట గౌరవం జరిగినది.
ఆ గౌరవ పురస్కరం అందుకున్నది
Neer Marudhu అనే(Heritage Tree) చెట్టు.
నాగర్ కోయిల్,  పుదెరీ (Nagercoil, Puthery) రూట్ లో
ఎజంతిమంగళం వద్ద 500 ఏండ్ల నాటి "అర్జున వృక్షము" ఉన్నది.
నీఋ మరుదు చెట్టు- కు తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం :-"
తొల్కాప్పియర్ మహా కవి" పేరుతో సంభావించింది.
డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఐన వి.సుందర రాజు ఆధ్వర్యంలో
సభా సంరంభం జరిగింది.
V.Sundara raju :-
"this one is the first-ever tree,
which  has been identified outside the forest area in the district."
అని అభివర్ణించారు.  
District Collector  రాజేంద్ర రత్నూ(Rajendra Ratnoo)
"ఈ వృక్షాన్ని రాష్ట్రమునకు అంకితం చేసారు"

అర్జున తరువు (Link)

{Heritage Tree - Neer Maruthu (Tholkappiar)
Place : Esanthimanagalam}
Neer Marudhu

prAchIna gAMDIva paadapamu
TamilNadu లో ప్రాచీన గాండీవ పాదపము

తమస్సు ఇచ్చినట్టి ఉడుగరలు, కానుకలు


SriSriRadhaBanaBihari
















అలర్మేలు మంగమ్మ -నీలాల కుంతలములు,
ఓలాల! చూడరమ్మ!- నిశి వన్నెను మభ్యపెట్టు
(అనుపల్లవి):
||ఔరా! ఔరౌరా! చూడరమ్మ వింతలు!
                   గోరోజన చమత్కృతులు            ||              

హాయిగ తిరు నాథుని- సేవించగ -  రేయి ఇరులు కదలినవి        
మాయగ మంగమ్మ కురులు- వింత నీలిమా ద్యుతులను;
ఉడుగరలుగ, కానుకలుగ - శ్రీనాథుని కర్పించెను ;
సోయగాముగ హొయలోలికేను  
||ఔరా! ఔరౌరా! చూడరమ్మ వింతలు!    
                 గోరోజన చమత్కృతులు               ||

చెరలాటము చాలించి, గాఢాంధకారము బుద్ధిగ ;  
"తరుణి కేశ పాశములతొ- నెయ్యము మేల"ని తలచీ,
వనిత జుత్తునకు జట్టుగ- చేరి, తాను-నీలవర్ణు- సిరి మేనున కరిగినది
||ఔరా! ఔరౌరా! చూడరమ్మ వింతలు!    
                 గోరోజన చమత్కృతులు               || 

Angkor అనగా నగరము


ఆంగ్ కోర్ అనగా నగరము.
సంస్కృత పదమైన "నగర్" అనే పదము Angkor మూలము.
కంబోడియా దేశములో అటవీప్రాంతములలో ఉన్నది.
లో ఆంగ్ కోర్ పట్టణము, త ప్రోమ్ దేవాలయము
యునెస్కో వర్ల్డ్ హెరిటేజ్ - (Unesco World Heritage) వారి
గుర్తింపు లిస్టులో చేరినది.
ఖ్మేర్ సామ్రాజ్య సామ్రాట్టుల శిల్పకళాభిరుచికి
ఈ కోవెల పట్టుకొమ్మ.
9-10 Centuries లో విలసిల్లిన కళాప్రతిభకు
Angkor,Cambodia తార్కాణము.
"విశ్వ సామ్రాట్"గా తనను అభివర్ణించుకున్న
2 వ జయవర్మన్  ( 2 nd Jayavarman, 1432) పాలనా కాలం వరకూ
Kmer Empire పరిపాలన కొనసాగినది.
ఈ ప్రాచీన పట్టణాన్ని
ప్రతి ఏటా రెండు కోట్లు సందర్శకులు వీక్షిస్తూ ఉంటారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Angkor nagar, tree



(Visitors two million annually. )
అక్కడి ఒక చెట్టును జాగ్రత్తగా గమనించండి.......                      
వయ్యారంగా నిలబడిన ఒక వనిత- శిల్పం చెక్కినట్లుగా
అనిపిస్తూన్నది కదూ!!!

woman like tree (Link for photo)


కొరియాలో 8౦౦ సంవత్సరాల sacred చెట్టు

కొరియా దేశములో ఒక గుడి వద్ద 
8౦౦ సంవత్సరాల వయసు ఉన్న చెట్టు ఉన్నది.
జోగ్యెసాన్ పర్వతము పై విచిత్ర స్వరూపం దాల్చిన చెట్టు ఉన్నది.
ఒకే చోట ఉన్న జంట చెట్లు ఇది. 
ప్రాచీన పాదపముగా ఆ సుగంధ తరువు గుర్తింపు పొందినది.
దక్షిణ జేల్లో ప్రావిన్స్ , సున్చియాన్ లో  తరువు కలదు.
వింత ఆకారాన్ని దాల్చిన ఈ చెట్టు టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణ .   


8౦౦ సంవత్సరాల Korea tree 










Nestled in the Jogyesan Mountain                     in Suncheon, 
South Jeolla Province, 
inside the Songgwangsa Temple grounds, 
stand the 800-year-old aromatic trees, 
dubbed as the Double Aromatic trees. 
The trees, (Juniperus Chinensis Limme); 
have been designated Natural Monument  


{courtesy of Kim Seong-ryong from joongangdaily}

కొరియాలో 8౦౦ సంవత్సరాల korea sacred చెట్టు  (Link)

Tuesday, August 23, 2011

విత్తము నీ దరహాసము

















చిత్తము నీ మృదు తలపుల పొత్తము;
విత్తము నీ మధు దరహాసము;
స్వామి! వెలగ ఈయుమోయి మాకు!;
ఈ ధరను శ్రీమంతులము
మేము ఔదుమౌను ఔనోయీ!

అను పల్లవి: 
మురళీ ధర! మనోహరా!
శాంతి సౌభాగ్య వరదాయీ! క్రిష్ణ!| ||మురళీ ధర! ||

జిగినీల బిజిలీల      
తగని లీలల మెరుపులు          
జగములేలు దేవరా!;        
గగన నీల వర్ణుడా!  
నీ, కోవెలలు మా ఎడదలు;    
కొలువు తీర రావోయీ!              ||మురళీ ధర! ||

తూరుపు తొలి పొద్దునందు        
పగడాల కాంతి విరిసినది
దొంగ నిదుర చాలించి,
వైళమె విచ్చేయుము!;    
లోక జాగృతి నీవే గాన!               ||మురళీ ధర! ||
 
;

Wednesday, August 17, 2011

ఆఫ్రికా ఖండములో వింత చెట్టు


Moringa Oliefera, Horse raddish, mulaga kaya chettu 

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా అత్యంత వేగంగా -
తమను తాము మలుచుకుని, పెరుగుతూ, నిలదొక్కుకునగలవు వృక్ష జాతి.
ఆఫ్రికా ఖండములో - ములగ చెట్టు
(అక్కడ, కొన్ని ప్రదేశాలలో  హార్స్ రాడిష్ అనేపేరును కూడా కలిగినది)
మనకు వింతగానే అనిపించవచ్చును కదా!
ఈ ఫొటోలో గమనించండి.

Moringa (botanical name “Moringa olefeira”) or Sahijan  (सहजन)
also called Drumstick tree or
Horseradish tree is a versatile tree
useful not only for human beings but also for animals
and also in various industrial applications.
People in India have been using it as an item of
their daily food for nearly 5000 years.

 Common Name:

Hindi -         Sahjan  (सहजन)
English -      Moringa, Drumstick tree, Horseradish tree
Latin  -         Moringa oleifera  
Sanskrit -     Surajana
Tamil    -      Amukira  
Kannada -    Keramaddinagaddi
Telugu       -   Mulakkaya
Malayalam-  Muringa.
Marathi     -  Shevga
Gujarati    -  Saragvo
Bengali       Sojne danta
Oriya         Sajana or Sujuna
Punjabi       Surajana
Nepali        Sajiwan or Swejan
Assamese      Sojina
Sinhalese   Murunga


Recent research:
   Indian scientists have discovered
an even more tantalising application of Moringa oleifera,
the drumstick plant "murunga", liquid extracted from its leaves
can prevent lethal radiation damage to living tissues.
The discovery by radiobiologists
at the Jawaharlal Nehru Cancer Hospital and Research Centre, Bhopal,
raises fresh hopes that
compounds from medicinal plants might emerge
a major source of natural drugs
that could prevent the harmful effects
of radiation damage to living tissues.
  The drumstick  might one day find use in improving
the efficiency of cancer treatment with radiation 
because it can reduce the severe side-effects of radiotherapy.
Radiation damage to normal tissues in the body
lead to the adverse effects associated with radiotherapy.
   Researchers in Japan and elsewhere had shown
that Moringa Oleffera extracts had antitumour and anti- inflammatory agents.



HorseRadish tree, Malunggay- Moringa Oliefera  (Link, photo,Essay)

English Name: Horseradish tree,
                      Ben Oil tree,
                      Drumstick tree
Indian scientists (Link)

Sunday, August 14, 2011

మువ్వన్నెల జెండాకు దండాలు!





















తూర్పు దిక్కు సూరీడుకు మెలకువ తెప్పించే _
మన,మువ్వన్నెల జెండాకు - దండాలు! దండాలు!       ||
:
పతాకమును నిలుపు కర్ర; కోదండము సమానము;      
గాలి అలల కవాతులు - పతాకము రెపరెపలు ||        
:
అన్యాయం, దుర్నీతిల - కళ్ళ కావరములు;
దిగ దుడిచి, విసిరేసే- మహా శక్తి మన జెండా  ||
:
దుర్మార్గం, దుష్టత్వం- పిక్క బలము చూపించీ
దిక్కులు పర దిక్కులయీ; పరుగో పరుగు ||
:  
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&













tUrpu dikku sUrIDuku melakuva teppiMchE
mana, muvvannela jeMDAku - daMDAlu! daMDAlu!    ||
:
pataakamunu nilupu karra; kOdaMDamu samAnamu;
gaali alala kavAtulu - patAkamu reparepalu ||
:
anyaayaM, durnItila - kaLLa kAvaramulu;
diga duDichi, visirEsE- mahA Sakti mana jeMDA ||
:
durmArgaM, dushTatvaM-
pikka balamu chUpiMchI
dikkulu para dikkulayI;
parugO parugu  ||


భారత మాతకు వందనము!


భారత మాతకు వందనము!















వందనం! వందనం! భారత మాతా!
నీ కరుణా రస వృష్టిచే
సకల జగతి నందనం ;      
ఇది ఎల్లరి ఆకాంక్ష! ||

వందే మాతరం! వందే మాతరం!
వంద, వేయి, కోటి గళము              
లందు తొణుకు నినాదం!        ||

జనగణమన- జయహో! - రాగం
ఘన సుందర జాతీయ గీత-
మనవరతము మన మనముల
మణిమందిర మొనరించే గీతోజ్జ్వల భావం  ||
 
&&&&&&&&&&&&&&&&&&&&&

vaMdanaM! vaMdanaM! bhaarata maataa!
nI karuNA rasa vRshTichE
sakala jagati naMdanaM ;
idi ellari aakaaMksha! ||

vaMdE maataraM! vaMdE maataraM!
vaMda, vEyi, kOTi gaLamu
laMdu toNuku ninAdaM!        ||

janagaNamana- jayahO! - raagaM
Gana suMdara jaatIya gIta-
manavaratamu mana manamula
maNimaMdira monariMchE gItOjjvala BAvaM  ||
 


Thursday, August 4, 2011

అచ్చులకూ, హల్లులకూ సఖ్యత


















"అ"నుండి "క్ష" వఱకు - అక్షర మాల
అచ్చులకూ, హల్లులకూ సఖ్యత, కడు మైత్రి;
కలిగినపుడు వెలిసాయి వాక్కు, శబ్దం!

శ్రీ వాణీ హస్తమున;
అక్ష మాల, పుస్తకం;
శోభాన్విత ఆభరణం, దేదీప్యం ప్రకాశం!
"పుస్తకం హస్త కమల భూషణం"
అను సామెత సర్వ విదితం:

అక్షర పద విన్యాసం;
భావములకు చిత్రణం;
అందుకే మనమందాం- ఓ నేస్తం!
"ఎచట లిపి, అక్షరం పూజ్యనీయమౌనో 
 అచటనే విజ్ఞానం ఉజ్జ్వల ప్రకాశం"



art పళ్ళు ,బొమ్మలు


art toys















సొరకాయ బుర్రలనూ, పుచ్చకాయ వంటి పెద్ద కాయలనూ
కళా ఖండాలుగా మలచవచ్చును.
పనస కాయ వంటి పెద్ద సైజు పండ్లు ఉన్నాయి కదా!
వాటిలోని గుజ్జునూ, రసాలనూ,
తొనలనూ వగైరా వగైరాలను తీసుకుని,
శుభ్రంగా భుజించవచ్చు.
లోపల ఆ పై తొక్కు, పై పొరలను, చెక్కులనూ
నీరెండలో జాగ్రత్తగా షేప్ పాడవకుండా , ఎండబెట్టాలి.    
పూర్తిగా లోపలి తేమ అంతా ఇగిరి, 
ఎందలో బాగా ఆవిరి ఐ, 
ఎండిన తర్వాత, వాటితో బొమ్మలను, 
ఆర్ట్ పీసుల్నీ తయారు చేసి, ఎంజాయ్ చేయండి.

         కాయల డొల్లలతో బొమ్మలు ; 


Wednesday, August 3, 2011

విద్యా దీపము
















"చదువు"-                     
చల్లని వెలుగుల
వెదజల్లే దీపము
విద్య నేర్చుకొనుట
మన ఎల్లరి కర్తవ్యము    ||

విద్య రత్న సోపానం
జ్ఞానం ఉన్నత గమ్యం
చదువు, శాంతి సారాంశం
ఆకళింపు చేసుకున్న
మనిషి జన్మ సార్ధకం

||అందుకనే మిత్రమా!
 విద్య నేర్చుకొనుట
 మన ఎల్లరి కర్తవ్యం     ||

అక్షరమ్ములు
విజ్ఞాన ద్వార తోరణ మాలికలు;
అక్షరమ్ముక్కైనా
తెలియకున్న మనిషి బ్రతుకు
అస్తావ్యస్తం అగు-
ఆస్కారం మెండు కదా!

||అందుకనే మిత్రమా!
 విద్య నేర్చుకొనుట  
 మన ఎల్లరి కర్తవ్యం     ||

అక్షరములు భావములకు
ఏర్పరచును ఆకారం
మంచి ఊసుల చదువు
శాంతి సౌభాగ్యముల నెలవు


||అందుకనే మిత్రమా!
 విద్య నేర్చుకొనుట  
 మన ఎల్లరి కర్తవ్యం     || 

(విద్య అనే దీపము /
   విద్యా దీపము ) 

Newaavakaya magazine  (విద్యా దీపము )  Link )


అమెరికాలో హరే క్రిష్ణ భక్తి ఉద్యమము


Krishna Consciousness temple














జనవరి 17, 1967 వ సంవత్సరము-
San Francisco Airport లో
దాదాపు వంద మంది హిప్పీలు ఒక మంత్రమును ఉచ్ఛరిస్తూన్నారు.
“హరే క్రిష్ణ” మంత్రము అది!
హైట్ ఆష్బెర్రీ హిప్పీ సంస్థ
(Haight-Ashbury hippie community) సభ్యులు వారు.

 "హరే క్రిష్ణ హరే క్రిష్ణ 
  క్రిష్ణ క్రిష్ణ హరే హరే
  హరే రామ హరే రామ
  రామ రామ హరే హరే!" 

ఈ మంత్రం "కలి సంతరణ ఉపనిషత్"లోనిది.
క్షీర సముద్ర నివాసి, ఆది శేష శయనుడు ఐన
శ్రీ విష్ణుమూర్తి అవతారము - శ్రీ క్రిష్ణమూర్తి.
శ్రీరామచంద్రుడు ఏకపత్నీ వ్రత ఆచరణతో -
భారతీయ సమాజమునకు ఆదర్శప్రాయ కుటుంబవ్యవస్థను నెలకొల్పి,
అందించిన పురుషోత్తముడు.
శ్రీ రామ, శ్రీ క్రిష్ణ నామములను
మననం చేసే మంత్రము భక్తకోటికి లభించినది.
The famous Krishna chant,

న్యూయర్క్ లో ని “హరే క్రిష్ణ”చెట్టు  మంత్రము
ఇర్విన్ అల్లెన్ జిన్స్ బర్గ్ ను ఆకట్టుకున్నది.
అమెరికాలో ఈ ఉద్యమముమును ప్రచారంలోకి తీసుకువచ్చాడు గిన్స్ బర్గ్.
టిమోతీ లియరీ, గారీ సిండర్, అలన్ వాట్స్
(Timothy Leary, Gary Snyder, Alan Watts)  మొదలైనవారు
 ఆతని అనుచర బృందంలో చేరారు.
The Mantra-Rock Dance ను రూపొందించిన సృజనశీలి గింస్ బర్గ్.
Haight-Ashbury hippie community, ఆతని ద్వారా
మంత్ర రాక్ నాట్యము ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినది.

అమెరికా లోని The San Francisco Hare Krishna temple సుందరమైనది.
అవలాన్ బాల్ రూం , మంత్ర-రాక్ డాన్స్ సంఘటనలు,
హరే క్రిష్ణ ఉద్యమము- ఇత్యాదులు-
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విభిన్న సంస్కృతిని పరిచయం చేసినవి.
Airport lounge   లో ప్రభుపాదులకు చేతులలో
పూల బొకేలను పట్టుకుని స్వాగతం పలికారు.
3 వేలమంది హిప్పీ ప్రజలు,
Ginsberg  ద్వారా భక్తి వేదాంత స్వామికి శిష్యులై  
ఆ నాటి ఆరాధనలో - 
 Hare Krishna mantra ను జపిస్తూ పాల్గొన్న మహత్తర క్షణాలు అవి.

“Hare Krishna, Hare Krishna,
 Krishna Krishna, Hare Hare
 Hare Rama, Hare Rama
 Rama Rama Hare HarE"

Irwin Allen Ginsberg (June 3, 1926 – April 5, 1997)

hawaiinei:
Banyan Tree at the Hare Krishna Temple in Nuuanu















ఎ.సి. భక్తివేదాంత స్వామి అందించిన “హరే క్రిష్ణ” మంత్రము
ఇర్విన్ అల్లెన్ జిన్స్ బర్గ్ ను ఆకట్టుకున్నది.
అమెరికాలో ఈ ఉద్యమమును ప్రచారంలోకి తీసుకువచ్చాడు గిన్స్ బర్గ్.
టిమోతీ లియరీ, గారీ సిండర్, అలన్ వాట్స్
(Timothy Leary, Gary Snyder, and Alan Watts)  మొదలైనవారు
ఆతని అనుచర బృందంలో చేరారు.
the Mantra-Rock Danc ను రూపొందించిన సృజనశీలి గింస్ బర్గ్.
 Haight-Ashbury hippie community, ఆతని ద్వారా,
మంత్ర రాక్ నాట్యము ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినది.
 అమెరికా లోని the San Francisco Hare Krishna temple సుందరమైనది.
అవలాన్ బాల్ రూం , మంత్ర-రాక్ డాన్స్ సంఘటనలు,
హరే క్రిష్ణ ఉద్యమము- ఇత్యాదులు-
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విభిన్న సంస్కృతిని పరిచయం చేసినవి/ది.
Airport lounge   లో ప్రభుపాదులకు చేతులలో పూల బొకేలను పట్టుకుని స్వాగతం పలికారు.
3 వేలమంది హిప్పీ ప్రజలు,  Ginsberg  ద్వారా భక్తి వేదాంత స్వామికి ఆరాధనలో -
Hare Krishna mantra ను జపిస్తూ పాల్గొన్న మహత్తర క్షణాలు అవి.

 
@@@@@@@@@@@@@@@@@@@@

Krishna Consciousness Temple (టెంపుల్ Link)




@@@@@@@@@@@@@@@@@@@@


Tuesday, August 2, 2011

కోతి పళ్ళు


Monkey Biscuit Tree

దక్షిణ గుజరాత్ లో, మధ్య ప్రదేశ్ లో అడవులలో
పరిశోధకులకు కనిపించిన విశేష వృత్తాంతము ఇది.
పటాల్ కోట  పరిసరాలలో కోతులు ఈ ఫలములను తింటూంటాయి.
ఆ వానరములు గర్భమును దాల్చినప్పుడు,
పిల్లలను ప్రసవించిన  తరువాత దేహ ఆరోగ్య భద్రతకు
ఇవి ఉపయోగిస్తున్నాయని ఆదివాసీలు, ప్రజలు తెలుసుకున్నారు.
"వానర ఫలములు" - అని ఒక జాతి తరువుకు కాస్తూన్న 
కాయలకు పేరు వచ్చినది.
పటల కోట్ వద్ద సర్వేలో ఈ విశేషాన్ని కనుక్కున్నారు.
(HOLOPTELEA INTEGRIFOLIA: MONKEY’S FRUIT)
హోలొప్టేలియా జాతి చెట్టు వైద్య పరంగా విశిష్టమైనది.
అక్కడి కొండ జాతి ప్రజలు, గిరి జనులు 
ఈ తరు సంపదను చిట్కా వైద్యాలకు బాగా వాడుతూన్నారు.
అనేక జంతువులు, పక్షులు ప్రకృతి సిద్ధంగా
తమ ఆరోగ్య భద్రతా విధానాలను ప్రకృతి నుండి,
చెట్లు, ఫల పుష్ప పత్ర సంపదలనుండి,
పంచభూతాలనుండీ - అనగా - "భూమిరాపో అనలో వాయుః"
నేల, నింగి, నీరు, నిప్పు, గాలి -
వీనిని తమ శరీర స్వభావానుగుణంగా ఎలా వాడుకోవచ్చునో తెలుసుకుని,
ఆచరిస్తూన్నాయి, ఆయా ప్రకృతి జీవజాలములను పరిశీలించడము వలన, 
ఆయుర్వేదము, యునానీ, సిద్ధ వైద్యాది పద్ధతులు అభివృద్ధి గాంచి,
మానవాళికి ఇతోధికంగా ఉపకరిస్తున్నవి.


Indian Name: चिरबिल्व, पापडी, वावळ              
English Name: Monkey Biscuit Tree                        
Botanical Name: Holoptelea integrifolia planch
Tribals in both these remote areas of India use
Holoptelia in many herbal practices.

          Monkey Fruits  (Link)

ధరణి భద్రత

















పర్యావరణ పరి రక్షణ పట్ల ఉన్న
ఆదుర్దాతో కూడిన ఆర్ద్రతా ఆసక్తి -
"కలిమి"గా కలిగి ఉన్న ఒక సాధారణ భారతీయ పౌరుడు ఇతను.
Save the Earth అనే నినాదం పట్ల ప్రజలకు భక్తిని కలిగిస్తూన్నారు.
ఈ ఫొటో అందుకు నిలువెత్తు దర్పణము.
Sudarshan Biswal creating awareness for saving trees.

ధరణి భద్రత, ఉర్వి రక్షణ అందరి బాధ్యత