భారత మాతకు వందనము! |
వందనం! వందనం! భారత మాతా!
నీ కరుణా రస వృష్టిచే
సకల జగతి నందనం ;
ఇది ఎల్లరి ఆకాంక్ష! ||
వందే మాతరం! వందే మాతరం!
వంద, వేయి, కోటి గళము
లందు తొణుకు నినాదం! ||
జనగణమన- జయహో! - రాగం
ఘన సుందర జాతీయ గీత-
మనవరతము మన మనముల
మణిమందిర మొనరించే గీతోజ్జ్వల భావం ||
&&&&&&&&&&&&&&&&&&&&&
vaMdanaM! vaMdanaM! bhaarata maataa!
nI karuNA rasa vRshTichE
sakala jagati naMdanaM ;
idi ellari aakaaMksha! ||
vaMdE maataraM! vaMdE maataraM!
vaMda, vEyi, kOTi gaLamu
laMdu toNuku ninAdaM! ||
janagaNamana- jayahO! - raagaM
Gana suMdara jaatIya gIta-
manavaratamu mana manamula
maNimaMdira monariMchE gItOjjvala BAvaM ||
No comments:
Post a Comment