Tuesday, August 23, 2011

విత్తము నీ దరహాసము

















చిత్తము నీ మృదు తలపుల పొత్తము;
విత్తము నీ మధు దరహాసము;
స్వామి! వెలగ ఈయుమోయి మాకు!;
ఈ ధరను శ్రీమంతులము
మేము ఔదుమౌను ఔనోయీ!

అను పల్లవి: 
మురళీ ధర! మనోహరా!
శాంతి సౌభాగ్య వరదాయీ! క్రిష్ణ!| ||మురళీ ధర! ||

జిగినీల బిజిలీల      
తగని లీలల మెరుపులు          
జగములేలు దేవరా!;        
గగన నీల వర్ణుడా!  
నీ, కోవెలలు మా ఎడదలు;    
కొలువు తీర రావోయీ!              ||మురళీ ధర! ||

తూరుపు తొలి పొద్దునందు        
పగడాల కాంతి విరిసినది
దొంగ నిదుర చాలించి,
వైళమె విచ్చేయుము!;    
లోక జాగృతి నీవే గాన!               ||మురళీ ధర! ||
 
;

No comments:

Post a Comment