మురిపెముల క్రిష్ణుడు |
వ్యత్యస్త చిత్ర చిత్రములను రాసినాడు క్రిష్ణుడు
చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు ||
పాలలోన దోసిళ్ళను తిప్పి తిప్పి-
తేలాడే మీగడలను అరచేతను పట్టినాడు
చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు ||
పెరుగులనూ జున్నులనూ- పిడికిళ్ళతొ జవిరి పట్టి,
మురిపెముగా మేనెల్లా పూసుకున్నాడు చూడు!
చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు||
తరిపి పాల జున్ను గడ్డలన్ని;
మూతి మోము అంతటా తురుముకున్న వైనాలు;
పాల కడలి తేలాడెను నీలి నింగి పైన నేడు;
||వ్యత్యస్త చిత్ర చిత్రములను రాసినాడు క్రిష్ణుడు
చిన్ని క్రిష్ణుడు, మన చిన్నారి క్రిష్ణుడు ||
&&&&&&&&&&&&&&&&&&&&
vyatyasta chitra chitramulanu raasinaaDu krishNuDu
chinni krishNuDu mana chinnaari krishNuDu ||
paalalOna dOsiLLanu tippi tippi-
tElaaDE mIgaDalanu arachEtanu paTTinaaDu;
chinni krishNuDu mana chinnaari krishNuDu ||
perugulanuu junnulanuu- piDikiLLato javiri paTTi,
muripemugaa mEnellaa pUsukunnaaDu chUDu!
chinni krishNuDu chinnaari krishNuDu ||vya||
No comments:
Post a Comment