Thursday, August 25, 2011

తమస్సు ఇచ్చినట్టి ఉడుగరలు, కానుకలు


SriSriRadhaBanaBihari
















అలర్మేలు మంగమ్మ -నీలాల కుంతలములు,
ఓలాల! చూడరమ్మ!- నిశి వన్నెను మభ్యపెట్టు
(అనుపల్లవి):
||ఔరా! ఔరౌరా! చూడరమ్మ వింతలు!
                   గోరోజన చమత్కృతులు            ||              

హాయిగ తిరు నాథుని- సేవించగ -  రేయి ఇరులు కదలినవి        
మాయగ మంగమ్మ కురులు- వింత నీలిమా ద్యుతులను;
ఉడుగరలుగ, కానుకలుగ - శ్రీనాథుని కర్పించెను ;
సోయగాముగ హొయలోలికేను  
||ఔరా! ఔరౌరా! చూడరమ్మ వింతలు!    
                 గోరోజన చమత్కృతులు               ||

చెరలాటము చాలించి, గాఢాంధకారము బుద్ధిగ ;  
"తరుణి కేశ పాశములతొ- నెయ్యము మేల"ని తలచీ,
వనిత జుత్తునకు జట్టుగ- చేరి, తాను-నీలవర్ణు- సిరి మేనున కరిగినది
||ఔరా! ఔరౌరా! చూడరమ్మ వింతలు!    
                 గోరోజన చమత్కృతులు               || 

No comments:

Post a Comment