Wednesday, December 1, 2010

క్రీడలలో శిష్యులు
కన్నయ్య కొన గోట గోవర్ధనాలు పూసె;
గిరులపైన దుబ్బు మబ్బు కిరీటలు మెరిసె!

మేఘాల జల్లుల జల జల జలపాతాలు
నీటి వాలు చేరికలు ; కొలనులన్ని కళ కళా!

సరసులలో తామరలు, కలువ పూల మిస మిసా!
తీరాల పొదరిళ్ళు ,వనాలన్ని పచ్చన,

కారడవులందు చెంగు చెంగు ఆటలాడు దుప్పులు,
బాలలకు గంతులను నేర్పేను కూన లేళ్ళు;

రివ్వు రివ్వు పిట్టలు; దవ్వులనే జాబిల్లీ వెన్నెలలు
పిల్లలందరికీ అవి క్రీడలలో శిష్యులు

&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment