Tuesday, December 28, 2010

శృతి సిరి బోణీ నీవె మయూరీ!




















నెమలీ! నెమలీ! రావే! రావే!
రాజ హంసకు సరి జోడీ!
కచ్ఛపి వీణియ రాగమ్ములకు
శృతి సిరి బోణీ నీవె మయూరీ! ||

వసి వాడి, వత్తలౌ జన మానసములు;
నందన వనులై విరియ బూయును
విప్పిన నీ పురి, యమున తరగలు
చెమ్మ చెక్కలు ఆడుచుండును ||

బులిపించుట నీకు సంబరమ్ములే!
మయూరి పింఛము కనుల నింపుకొన
రేయి, పగలుగా ప్రతి నిత్యం
ఒప్పుల కుప్పలు తిరుగు అంబరం! ||

No comments:

Post a Comment