శేష తల్పము వీడి వ్రేపల్లెలోనశ్రీ కృష్ణ మూర్తిగా వెలిసినాడోయమ్మా!ధరణి హర్షము నిండెనే! – చెలియరో! –ధరణి హర్షము నిండెనే! ||అరుణాధరములన్ వర వేణువూదేనుతరుణ తమకమ్మాయె మలయ మారుతములకురాగ నాట్యాలాడెనే – అను రాగ నాట్యాలాడెనేమాయ ఇది ఏమిటోను?! – చెలియరో!మాయ ఇది ఏమిటోను?! ||తన నీల వేణిలో నెమలి కన్నులు ఊగెకను గొన్న నింగికి తార కన్నులు కోటి/తోటితనివి తీరా – నీల మోహనుని చూచేను;మాయ ఇది ఏమిటోను?! – చెలియరో!మాయ ఇది ఏమిటోను?! – ||కెంపు – లే(త)పాణిలో నవనీత ముద్దలను“నా బొమ్మలవి “ అనుచు – తనివార కాంచేను; -పౌర్ణిమా జాబిల్లి ,ఇంపు కులుకుల సాగెనే!మాయ ఇది ఏమిటోను?! – చెలియరో!
Thursday, December 30, 2010
మాయ ఇది ఏమిటోను?!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment