Wednesday, December 1, 2010

కార్తీక శోభలు


దివిని నిత్య పండుగ ,కార్తీక శోభలు
నదీ ఝరుల ఉరవడులు
నావ సాగు మును ముందుకు
తెడ్డు వేయి, నావికా!, హైలో! హలెస్సా! ||

చెరువు, కొలను,సెలయేళ్ళూ
నదికి అనుగు సోదరులురా!
జలపాతం, వెన్నెలలను
పలకరిస్తు సాగవోయి ముందుకు ||

గగనాల తారకలు జలములందు సొగసులు
అలల పైన తేలేటి దీపాల వెలుగులు
కెరటాల నురుగులపై నిత్య రత్న జ్యోతులు
సదా ఇచట కను పండుగ కార్తీక దివ్వెల్ల పర్వాలు ||

No comments:

Post a Comment